జిల్లా మెజిస్ట్రేట్ ఆవుపై అధికారుల స్పెషల్ కేర్.. ఏకంగా ఏడుగురు వైద్యుల నియామకం

దిశ, ఫీచర్స్ : ఉత్తరప్రదేశ్‌ ఫతేపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్ అపూర్వ దుబేకు సంబంధించిన ఆవుకు చికిత్స అందించేందుకు స్పెషల్ కేర్ తీసుకున్నాడు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఎస్‌కే తివారీ..Latest Telugu News

Update: 2022-06-13 08:14 GMT

దిశ, ఫీచర్స్ : ఉత్తరప్రదేశ్‌ ఫతేపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్ అపూర్వ దుబేకు సంబంధించిన ఆవుకు చికిత్స అందించేందుకు స్పెషల్ కేర్ తీసుకున్నాడు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఎస్‌కే తివారీ. ఇందుకోసం ఏకంగా ఏడుగురు పశువైద్యులను నియమించిన ఆయన.. ఆవుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఆ జిరాక్స్ కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆవును సంరక్షించడానికి ప్రతిరోజు 7మంది వెటర్నరీ డాక్టర్లను నియమించినట్లు సదరు కాపీలో పేర్కొనబడింది. అంతేకాదు ఏడుగురిలో ఎవరైనా అందుబాటులో లేకుంటే ప్రత్యమ్నాయంగా ఎనిమిదవ వైద్యుడిని కూడా అసైన్ చేశారు. ఇక ఆవును రోజుకు రెండుసార్లు చెక్ చేయాలని.. నివేదికను సాయంత్రం 6గంటల్లోపు సివిఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇకపోతే విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని లేఖలో హెచ్చరించారు.


Similar News