గ్రహాంతర వాసులు మనల్ని రహస్యంగా గమనిస్తున్నారా?.. మరెందుకు కనిపించరు?

సైంటిస్టులు అనేక విశ్వ రహస్యాలను ఛేదించారు. కానీ గ్రహాంతర వాసులకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2024-01-18 08:45 GMT

దిశ, ఫీచర్స్ : సైంటిస్టులు అనేక విశ్వ రహస్యాలను ఛేదించారు. కానీ గ్రహాంతర వాసులకు సంబంధించిన విషయంలో మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలతోపాటు కామన్ పీపుల్‌లో కూడా ఏలియన్స్‌కు సంబంధించిన ప్రతి విషయం క్యూరియాసిటీని పెంచుతుంది. ప్రస్తుతం అలాంటి మరొక అంశం ముందుకొచ్చింది. ఏంటంటే.. గ్రహాంతర వాసులు మనల్ని రహస్యంగా గమనిస్తారని ‘పీర్-రివ్యూడ్ పేపర్ 2024 ఎడిషన్’ పేరుతో యాక్టా ఆస్ట్రోనాటికా’లో ‘అధునాతన గ్రహాంతర నాగరికతలకు మనం కనిపిస్తామా?’ అనే శీర్షికతో పబ్లిషైన అధ్యయనం పేర్కొన్నది.

అయితే ఏలియన్స్ భూ గ్రహంపై ఉండే రియల్ టైమ్‌లో మాత్రం మానవులను చూసే అవకాశం లేదు. కానీ కాంతి అంతరిక్షంలో ప్రయాణించడానికి పట్టే సమయం కారణంగా కనీసం ఏలియన్స్ మనల్ని గమనించే సమయం కాంతి సంవత్సరాలను బట్టి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు భూమి అంతటా ఉన్న మేజర్ ల్యాండ్ మార్క్‌ను కూడా గ్రహాంతరవాసులు స్నూపింగ్ చేస్తున్నారు. వేల కాంతి సంవత్సరాల దూరంలో కూర్చొని తమ అల్ట్రా- అడ్వాన్స్‌డ్ టెలిస్కోప్‌లను వారు ఉపయోగిస్తున్నారని అధ్యయనం వెల్లడిస్తోంది. మరికొన్ని కొన్ని కాంతిసంవత్సరాల తర్వాత భూ గోళంపై రోమన్లు, గ్రీకులు, భారతీయులు, ఈజిప్షియన్ల కాలంలో భూమిపై నిర్మించిన భవనాల మాదిరి నిర్మాణాలను గ్రహాంతరవాసులు ఎంచుకోగలిగే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు పేర్కొంటున్నారు. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా జరిగిన అధ్యయనంతో ముడిపడి ఉందని ఓస్మనోవ్, సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ (SETI) ఇన్‌స్టిట్యూట్‌‌కు చెందిన సైంటిస్టులు పేర్కొంటున్నారు. మానవుల కంటికి ఏలియన్స్ కనబడాలంటే ఇంకా అనేక వేల కాంతి సంవత్సరాలు పట్టవచ్చని వారు పేర్కొంటున్నారు.


Similar News