ఒకే దృశ్యం.. భిన్న కోణాలు.. లోన్లీనెస్‌తో మారుతున్న బ్రెయిన్ యాక్టివిటీస్

కొందరు నేచర్ సౌండ్స్ విన్నప్పుడు ఆనంద పారవశ్యంలో మునిగిపోతారు. మరికొందరు ఇదేం శబ్దం.. చెవుల్లో ఒకటే మోత మోగుతోంది అంటారు. ఇక్క దృశ్యం, శబ్దం ఒక్కటే అయినా రిసీవ్ చేసుకునే లేదా అర్థం చేసుకునే తీరులో భిన్నత్వం కనిపిస్తుంది.

Update: 2024-01-17 10:01 GMT

దిశ, ఫీచర్స్ : కొందరు నేచర్ సౌండ్స్ విన్నప్పుడు ఆనంద పారవశ్యంలో మునిగిపోతారు. మరికొందరు ఇదేం శబ్దం.. చెవుల్లో ఒకటే మోత మోగుతోంది అంటారు. ఇక్క దృశ్యం, శబ్దం ఒక్కటే అయినా రిసీవ్ చేసుకునే లేదా అర్థం చేసుకునే తీరులో భిన్నత్వం కనిపిస్తుంది. అలాగే వ్యక్తులు ఎక్కువగా ఒంటరితనం, వివిధ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు ఆయా పరిస్థితులను భిన్నంగా అర్థం చేసుకుంటారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

లోన్లీనెస్ అనేది బాధితుల మెదడు బయటి సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో ఆటంకాలు కలిగిస్తుందని, ప్రపంచాన్ని భిన్నంగా చూసేలా ప్రభావితం చేస్తుందని రీసెర్చర్స్ అంటున్నారు. స్టడీలో భాగంగా వీరు యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సుగల 68 మంది యువకులను రెండు గ్రూపులుగా విభజించారు. వారికి వేర్వేరు సందర్భాల్లో వివిధ టాస్కులను కేటాయించి న్యూరో ఇమేజింగ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఇందులో ఒంటరితనంతో బాధపడేవారి బ్రెయిన్ యాక్టివిటీస్, అలాగే మిగతావారి బ్రెయిన్ ఫంక్షనల్ యాక్టివిటీస్ డిఫరెంట్‌గా ఉన్నట్లు గుర్తించారు. పైగా వారు వివిధ సందర్భాల్లో సామాజిక పరిస్థితులకు కూడా భిన్నంగా రియాక్ట్ అవడాన్ని పరిశీలించారు. సమాచారాన్ని ప్రాసెస్ చేసే విషయానికి వస్తే అందరూ ఒకేలా ఉంటారని గమనించారు. కాకపోతే ఒంటరితనంతో బాధపడేవారు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా సిచ్యువేషన్స్‌ను అర్థం చేసుకోవడం, ఇబ్బంది పడటం, అతి అంచనా వేయడం వంటి లక్షణాలను కనబర్చారు. అందుకే లోన్లీనెస్ అనేది అనారోగ్యాలకు దారితీస్తుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Similar News