స్పైడర్ మ్యాన్‌గా మారాలనేదే అతని కోరిక.. బొలీవియన్ బాలుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు !
పిల్లలు స్ర్కీన్‌లపై ఛోటాభీమ్, మోటు పత్‌లు, స్పైడర్ మ్యాన్ వంటి రకరకాల కామిక్ అండ్ కార్టూన్ మూవీస్ చూసి ఆనందిస్తుంటారు. కానీ అవి నెగెటివ్ ఎపెక్ట్ చూపుతాయనే సంఘటన ఒకటి సెంట్రల్ బొలీవియాలోని ఒరురో సిటీకి
దిశ, ఫీచర్స్ : పిల్లలు స్ర్కీన్‌లపై ఛోటాభీమ్, మోటు పత్‌లు, స్పైడర్ మ్యాన్ వంటి రకరకాల కామిక్ అండ్ కార్టూన్ మూవీస్ చూసి ఆనందిస్తుంటారు. కానీ అవి నెగెటివ్ ఎపెక్ట్ చూపుతాయనే సంఘటన ఒకటి సెంట్రల్ బొలీవియాలోని ఒరురో సిటీకి సమీపంలోగల విచులోమా మునిసిపాలిటీలో జరిగింది. విచిన్ అనే ఒక ఎనిమిదేళ్ల బాలుడు తన అభిమాన సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ లాగా మరాలని తరచుగా అనుకునేవాడట. దీంతో ఒకరోజు అతను ఆరుబయట బండరాయికిందగల నల్లటి విడో స్పైడర్ (ఆరాకిడ్)అనే సాలీడును పట్టుకుని, తన చేతిపై ఉంచి, ఉద్దేశ పూర్వకంగా కాటు వేయించుకున్నాడు. అది కరిస్తే తాను స్పైడర్ మ్యాన్‌గా మారుతానని ఆ బాలుడి అసలు ఉద్దేశం. అయితే ఆ కీటకం కాటు వేయగానే తీవ్రమైన నొప్పి స్టార్ట్ అయింది. ఇంటిలోకి వెళ్లిన బాలుడు నొప్పి పుడుతోందని తల్లికి చెప్పాడు కానీ అసలు విషయం మాత్రం దాచాడు.
సాలీడు కాటుకు గురైన బాలుడు విచిన్‌ను అతని తల్లి దగ్గరలోని హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లింది. అయితే ఏం జరిగిందో అక్కడి డాక్టర్లకు కూడా ఆ బాలుడు చెప్పకపోవడంతో వారు ఒరురోలోని డిపార్ట్‌మెంటల్ హెల్త్ సర్వీస్ యొక్క జూనోటిక్ డిసీజెస్ ప్రోగ్రామ్ హెడ్ ఎర్నెస్టో వాస్‌క్వెజ్ సంప్రదించారు. ఆ తర్వాత ఒక విషపూరిత సాలీడు కరిచినట్లు గుర్తించిన వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. చివరకు కోలుకున్న బాలుడిని అతని తల్లి సమక్షంలో ఏం జరగాలో చెప్పాలని చాలాసార్లు అడిగారు. చెప్పకపోతే హాని జరుగుతుందని, చనిపోయే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరించగా చివరికి తను ఒక సాలీడుతో కాటు వేయించుకున్నానని, అయినా తాను స్సైడర్ మ్యాన్‌గా మారకపోగా నొప్పి కలిగిందని సదరు బాలుడు వెల్లడించాడు. అసలు విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, డాక్టర్లు ఆశ్చర్య పోయారు. ఎర్రటి వీపు భాగం కలిగిన నల్లటి అరాకిడ్ అనే సాలెపురుగులు విషపూరితమైనవని వైద్య నిపుణులు చెప్తున్నారు. పెద్దలకు కాటు వేసినప్పుడు అంత ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ పిల్లలు దానికాటుకు గురైతే శరీరంలో నరాలపై ప్రభావం పడి కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. మరో విషయం ఏంటంటే.. పిల్లలు తరచుగా స్ర్కీన్లకు అడిక్ట్ అవ్వడంవల్ల జరిగే పరిణాలు ఎలా ఉంటాయో ఈ బొలీవియన్ బాలుడి అనుభవం ఒక గుణపాఠంగా తీసుకోవాలని, పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More..
మిస్టీరియస్ స్కల్.. కొత్తగా కనుగొన్న పుర్రెకు రుజువులు దొరకడం లేదంటున్న సైంటిస్టులు