స్మార్ట్‌ఫోన్ ఎంత చూసినా ఏం కాదా?.. నిద్రపై ఎలాంటి ప్రభావం చూపదంటున్న నిపుణులు !!

రాత్రిపూట స్మార్ట్ ఫోన్ లేదా అదర్ స్ర్కీన్స్ ఎక్కువగా చూస్తే ఏం అవుతుంది?.. వాటి నుంచి వెలువడే బ్లూ లైంటింగ్ కళ్లపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.

Update: 2024-01-16 10:16 GMT

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట స్మార్ట్ ఫోన్ లేదా అదర్ స్ర్కీన్స్ ఎక్కువగా చూస్తే ఏం అవుతుంది?.. వాటి నుంచి వెలువడే బ్లూ లైంటింగ్ కళ్లపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది. నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఇక తప్పదనుకున్నప్పుడు వాటిలో నైట్‌మోడ్ ఆన్ చేసుకుని చూస్తారు కొందరు. కానీ ఒక విషయం తెలిస్తే మాత్రం ఇక నుంచి ఆ నైట్‌మోడ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎవరికైనా.. ఎందుకంటే గత అధ్యయనాలకు భిన్నంగా, బ్లూ లైటింగ్ నిద్రను ప్రభావితం చేయదని తాజా అధ్యయనం పేర్కొన్నది. యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ అండ్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్‌కు పరిశోధకులు నిద్రపై బ్లూ లైటింగ్ ప్రభావానికి సంబంధించిన గత అధ్యయనాలను ఛాలెంజ్ చేస్తున్నారు. కాంతి రంగు మానవ జీవ గడియారాన్ని, స్లీప్ క్వాలిటీని ఎలా ప్రభావితం చేస్తాయి? అని ప్రశ్నిస్తున్నారు.

విజన్ ప్రాసెసింగ్ ఇలా..

నిజానికి విజన్ (దృష్టి) అనేది రెటీనా యొక్క ఫోటోరిసెప్టర్స్ (cones and rods) మెదడుకు దృశ్యాలను ప్రాసెస్ చేయడానికి కాంతిని విద్యుత్ ప్రేరణలుగా మార్చగలిగే ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఇందులో శంకువులు(cones) తగినంత వెలుతురులో పదునైన రంగుల దృష్టిని సులభతరం చేస్తాయి. తక్కువ వెలుతురులో బ్లూ కలర్ షేడ్స్ చూడటానికి సహాయపడతాయి. అదనంగా రెటీనాలోని స్పెషలైజ్డ్ గ్యాంగ్లియన్ సెల్స్ ఇందుకు హెల్ప్ అవుతాయి. ఇవి తక్కువ - తరంగదైర్ఘ్య కాంతికి (సుమారు 490 నానోమీటర్లు నీలంగా గుర్తించబడతాయి) తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. స్లీప్-వేకప్ రిథమ్స్‌ను నియంత్రించడంలో కీలక పాత్రపోషిస్తాయి. అయినప్పటికీ లైట్-సెన్సిటివ్ గ్యాంగ్లియన్ కణాలు కూడా శంకువుల నుంచి ఇన్ఫర్మేషన్‌ను పొందుతాయి. అలాంటప్పుడు మామూలు కాంతి అంతర్గత గడియారాన్ని ప్రభావితం చేయడం అసాధ్యమని పరిశోధకులు అంటున్నారు.

బ్లూ లైటింగ్ ఎఫెక్ట్ ఎంత?

బ్లూ లైటింగ్ నిద్రను లేదా జీవగడియారాన్ని ప్రభావితం చేయడమే నిజమైతే సూర్యోదయం, సూర్యాస్తమయం, ప్రకాశవంతమైన పగటి వేలలు కూడా మనల్ని ఎందుకు ప్రభావితం చేయవు అంటున్నారు తాజా అధ్యయనంలో పాల్గొన్న రీసెర్చర్స్. స్టడీలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ పరిశోధకులు 16 మంది వాలంటీర్లు నీలి, పసుపు, తెలుపు కాంతి ఉద్దీపనలకు బహిర్గతం కావడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్ర్కీన్ నుంచి వెలువడే నీలిరంగు అనేది సెన్సిటివ్ గ్యాంగ్లియన్ కణాలపై ఎటు ప్రభావం చూపలేదని గుర్తించారు. దీంతోపాటు వివిధ కాంతి పరిస్థితులలో పాల్గొనేవారి ఇంటర్నల్ క్లాక్, స్లీప్ ఆన్‌సెట్, స్లీప్‌డెప్త్, అలసట, ప్రతిచర్యల సామర్థ్యాన్ని కూడా పరిశోధకులు అంచనా వేశారు. కన్ క్లూజజన్ ఏంటంటే.. బ్లూ-యెల్లో పరిమాణంతో పాటు నీలి, ఇతర లేత రంగు వైవిధ్యం మానవ అంతర్గత గడియారాన్ని లేదా నిద్రను ప్రభావితం చేయవని నిర్ధారించారు.


Similar News