Dating @100 days : నచ్చితే పెళ్లి.. లేకుంటే బ్రేకప్ !

ఒకప్పుడు పెళ్లిళ్లు సంప్రదాయబద్దంగా జరిగేవి. చాలామంది పేరెంట్స్ చూసిన సంబంధాలకే ఓకే చెప్పేవారు. కానీ ప్రజెంట్ వరల్డ్ వైడ్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి.

Update: 2024-01-15 11:31 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు పెళ్లిళ్లు సంప్రదాయబద్దంగా జరిగేవి. చాలామంది పేరెంట్స్ చూసిన సంబంధాలకే ఓకే చెప్పేవారు. కానీ ప్రజెంట్ వరల్డ్ వైడ్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ముఖ్యంగా డేటింగ్ కల్చర్ డిఫరెంట్ లెవల్స్‌లో పెరిగిపోతోంది. కాలంతోపాటు కొంగ్రొత్త పోకడలు వస్తున్నాయి. ఇండియాలోనూ ఇది విస్తరిస్తోంది. ముఖ్యంగా మెట్రోసిటీస్‌లలో చాలామంది తమకు నచ్చిన వ్యక్తిని లైఫ్ పార్టనర్‌గా ఎన్నుకునే విషయంలో డేటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రజెంట్ టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో dating@100 days పేరుతో ఒక సరికొత్త డేటింగ్ ట్రెండ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఈ మోడర్న్ డేటింగ్ రూల్స్ ఏంటి? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి లేదా పెళ్లి చేసుకోవడానికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగా వందరోజులు కలిసి గడపడమే dating@100 days ముఖ్య ఉద్దేశమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయమంతా రిలేషన్‌షిప్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎలా నావిగేట్ చేయాలనే భావోద్వేగాల రోలర్‌ కోస్టర్‌గా ఉంటుంది. పర్‌ఫెక్ట్ లైఫ్ పార్టనర్‌ను ఎన్నుకునే ఆలోచనతో ఎదుటి వ్యక్తిని అంచనా వేయాలనే కాన్సెప్ట్‌తో స్త్రీ, పురుషులిద్దరూ కలిసి జీవిస్తారు. ఈ సందర్భంలో ఇద్దరు డిసైడ్ చేసుకున్న బౌండరీస్ కూడా కొనసాగుతాయి.

వందరోజుల్లో ఏం చేస్తారు?

లైఫ్ పార్టనర్‌ను ఎంపిక చేసుకునే క్రమంలో తమకు సెట్ అయ్యే వారితో లాంగ్‌టెర్మ్ రిలేషన్‌షిప్‌కు ప్రయారిటీ ఇవ్వాలని చాలామంది అనుకుంటారు. అయితే డేటింగ్ విషయంలో చాలా తక్కువ సమయం ఉంటే ఎవరు తమకు నచ్చుతారో, ఎవరు విలువైనవారో తెలుసుకోవడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుందని పలు డేటింగ్ యాప్ సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ తక్కువ సమయంలో ఎదటి వ్యక్తి అసలు క్యారెక్టర్ తెలిసే అవకాశం తక్కువ. పైగా ప్రతీ వ్యక్తి మంచివారిగానే బిహేవ్ చేస్తుంటారు. ఒరిజినల్ క్యారెక్టర్ తెలియాలంటే కాస్త సమయం కావాలి. అందుకు వందరోజులు అయితే సరిపోతుందనేది నయా డేటింగ్ రూల్. ఈ సందర్భంలో ఆడ, మగ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తాము ఎంపిక చేసుకునే పార్టనర్ కాల పరీక్షలో నిలబడగలరో లేదో తెలుసుకుంటారు. ఈ ఉద్దేశంతోనే ‘హండ్రెడ్ డేస్’ డేటింగ్ రూల్‌పై చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

బౌండరీస్ విత్ ప్రయారిటీస్

ఒప్పందంలో భాగంగా వందరోజులు కలిసి ఉంటారు కాబట్టి ఒకరిపట్ల ఒకరు పూర్తిగా కమిట్ అవ్వాల్సిన అవసరం ఈ నయా డేటింగ్ ట్రెండులో లేదు. పార్టనర్స్ ఇద్దరూ వ్యక్తిగత ఆస్తక్తులను బట్టి సరిహద్దులను సెట్ చేసుకుంటారు. అదే క్రమంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కొనసాగిస్తారు. ఈ సందర్భంలో ఇద్దరి మధ్య అండర్ స్టాంగింగ్, అబ్జర్వేషన్ కీ రోల్ పోషిస్తుంది. అదే సమయంలో వ్యక్తిగత, సామాజిక కోణాలు, అవసరాలు, కోరికల కంఫర్ట్ లెవల్స్‌ను పరస్పరం అర్థం చేసుకోవాలి. పార్టనర్స్ నిజాయితీగా, పారదర్శకంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వందరోజుల ప్రణాళికలో ఒకరిపై ఒకరు డామినేటెడ్ చేయకూడదనే రూల్ ఇందులో కీలకమని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు ఫిజికల్ డిస్టెన్స్, క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. క్వాలిటీ టైమ్‌, మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్స్‌లో పాల్గొంటూ పరస్పర అవగాహనతో మసలు కోవాలి. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్‌ను బిల్డ్ చేసుకోవడానికి, లాంగ్‌టెర్మ్ గోల్స్, వాల్యూస్ గుర్తించి అర్థం చేసుకోవడానికి ఈ వందరోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫైనల్‌గా తాము జీవిత భాగస్వాములుగా కొనసాగాలా వద్దా నిర్ణయించుకోల్సి ఉంటుంది.


Similar News