దశాబ్దాలు గడిచినా చైనా గ్రేట్ వాల్ చెక్కు చెదరలే.. ఎందుకో తెలుసా?
ప్రపంచంలోని వింతల్లో చైనా గ్రేట్ వాల్ ఒకటి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తులు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి దీనిని నిర్మించారు.
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని వింతల్లో చైనా గ్రేట్ వాల్ ఒకటి. సుమారు 3,000 సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తులు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి దీనిని నిర్మించారు. దాని నిర్మాణ సౌష్టవం, భౌగోళిక పరిస్థితుల కారణంగా అది ప్రపంచ టూరిస్టులను ఆకట్టుకుంటున్నది. ఈ ఎత్తైన, సుందరమైన వాల్‌ను చూడటానికి మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. అంతే కాదు అదిప్పుడు చరిత్రకారులను, ఆర్కియాలజిస్టులను కూడా మరో విషయంలో ఆలోచింపజేస్తోంది. ఏంటంటే.. ఎంతకాలమైనా చెక్కుచెదరని గొప్పకట్టడంగా ఎలా నిలువగలుగుతోంది? అనే సందేహాలు పలువురిని వెంటాడుతున్నాయి. అయితే అందుకు ‘లివింగ్ స్కిన్’ రక్షణగా నిలుస్తోంని నార్తెన్ అరిజోనా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. రీసెర్చ్‌లో భాగంగా సాయిల్ ఎకోలజిస్ట్ ప్రొఫెసర్ మాథ్యూ బౌకర్ నేతృత్వంలోని బృందం ఇక్కడ ఈ విషయాన్ని కనుగొనే క్రమంలో చైనా వాల్ పొడవునా 480 కిలోమీటర్ల శాంపిల్స్ సేకరించింది. పైగా ఈ ప్రాంతంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ బయోక్రస్టుతో కప్పబడి ఉందని గుర్తించింది.
చైనావాల్ వాల్ నిర్మాణ సమయంలో నేలలోకి నేచురల్ మెటీరియల్స్‌తో కుదించడం ద్వారా ఈ గోడ నిర్మించబడిందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే అప్పట్లో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయని, ఈ క్రమంలో వాల్ క్షీణించకుండా సహజ రక్షణ రేఖను అప్పటి నిపుణులు అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఈ డిఫెన్స్ మెకానిజం ‘బయోక్రస్టులు’ అని పిలువబడే చిన్న చిన్న రూట్‌లెస్ మొక్కలు, సూక్ష్మజీవులతో తయారు చేయబడిన ‘living skin’(సజీవ చర్మం) రూపంలో ఉంటుందని నిర్ధారించారు. వాస్తవంగా ‘బయోక్రస్ట్స్ ప్రపంచవ్యాప్తంగా పొడి ప్రాంతాల నేలలపై సర్వసాధారణంగా ఉంటాయి. కానీ సాధారణంగా వాటిని నిర్మాణాల్లో ఉపయోగించడం జరగదు’ అని సాయిల్ ఎకోలజిస్ట్ మాథ్యూ బౌకర్ పేర్కొన్నారు. చైనా వాల్ నిర్మాణంలో ఈ బయోక్రస్టులే కీలకపాత్ర పోషించాయి. కాబట్టి అది చెక్కు చెదరకుండా ఉంటోందని పరిశోధకులు చెప్తున్నారు. ఎందుకంటే వాటిలో లేయర్డ్ చేసిన నమూనాలు స్థిరత్వాన్ని, బలాన్ని ఇస్తున్నాయట. ఇది జస్ట్ సర్ఫేసియల్ లేయర్ మాత్రమే కాదు, సహజ క్షీణత, రాక్ వెదరింగ్ నిర్మాణం యొక్క నిరోధకతను పెంచడంలో సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషించే అద్భుతమైన ప్రక్రియ అంటున్నారు నిపుణులు.