గర్భం దాల్చకుండా ఉండటానికి కొత్త పద్ధతి.. AP, TS, UP లో త్వరలో అమలు

పిల్లలు కనడం ఇష్టం లేని వారు, లేదా పిల్లలు కలగకుండా శృంగారం చేయాలనుకునే వారు ఎక్కువగా కండోమ్స్, పిల్స్, కాపర్-T పద్దతులను అవలంభిస్తుంటారు.

Update: 2023-03-23 04:49 GMT
గర్భం దాల్చకుండా ఉండటానికి కొత్త పద్ధతి.. AP, TS, UP లో త్వరలో అమలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు కనడం ఇష్టం లేని వారు, లేదా పిల్లలు కలగకుండా శృంగారం చేయాలనుకునే వారు ఎక్కువగా కండోమ్స్, పిల్స్, కాపర్-T పద్దతులను అవలంభిస్తుంటారు. కానీ పై పద్దతులు కాకుండా గర్భనిరోధానికి మరో కొత్త పద్ధతిని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర యోచిస్తుంది. సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ అనే సాధనాన్ని మహిళల మోచేతి చర్మ పై పొరలో ఉంచుతారు.

దీని నుంచి మూడు సంవత్సరాల వరకు గర్భనిరోధక హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో మహిళలు గర్భం దాల్చ లేరు. కాగా కొద్దిరోజుల తర్వాత అవసరం లేదు అనుకుంటే దీన్ని సులువుగా తీయవచ్చు. కాగా ఈ నూతన పద్ధతిని మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ బీహార్, కర్ణాటకలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read: గృహ హింస కేసుల్లో తెలంగాణ రెండో స్థానం..

Tags:    

Similar News