3D-ప్రింటెడ్ రాకెట్‌ను రెడీ చేసిన నాసా.. ఇక మార్స్‌పైకి జర్నీఈజీ !

అంగారక గ్రహం అంటేనే సైంటిస్టులకు ఒక క్యూరియాసిటీ. ఇక్కడ నివాసయోగ్యమైన ఆనవాళ్లను గుర్తించడమే లక్ష్యంగా దశాబ్దాల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.

Update: 2024-01-05 07:30 GMT

దిశ, ఫీచర్స్ : అంగారక గ్రహం అంటేనే సైంటిస్టులకు ఒక క్యూరియాసిటీ. ఇక్కడ నివాసయోగ్యమైన ఆనవాళ్లను గుర్తించడమే లక్ష్యంగా దశాబ్దాల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ రెడ్ ప్లానెట్‌ భూమి నుంచి 300 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. దీంతో అక్కడికి ఒక్కసారి వెళ్లిరావడానికి ఏడు నెలలు పడుతుందని నాసా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ కాలవ్యవధిని తగ్గించడంపై పరిశోధనలు నిర్వహిస్తూ వస్తున్న శాస్త్రవేత్తలు దాదాపు విజయం సాధించారు. మార్స్‌పైకి వెళ్లడానికి అవసరమైన 3D-ప్రింటెడ్ రాకెట్‌ను రూపొందించారు. రీసెంట్‌గా అలబామాలోని హంట్స్‌విల్లేలోని మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ వినూత్నమైన రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ (RDRE) టెస్టు సక్సెస్‌ఫుల్‌ అయిందని సైంటిస్టులు చెప్తున్నారు. దానిని పరీక్షిస్తున్న సమయంలో 3D-ప్రింట్ చేయబడిన అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్, 251 సెకన్ల సుదీర్ఘ ప్రొలాంగ్ బర్న్ సాధించింది. నాలుగు నిమిషాల కంటే ఎక్కువగా 5,800 పౌండ్ల అట్రాక్టివ్ థ్రస్ట్‌ను ప్రొడ్యూస్ చేసిందని పరిశోధనకు రీసెర్చర్ థామస్ టిస్లి పేర్కొన్నారు.

ఇంతకు ముందు కూడా 2022లో ఇండియానాలోని లఫాయెట్‌లో ఉన్న ఇన్ స్పేస్ LLC అండ్ పర్డ్యూ యూనివర్సిటీ సహకారంతో రొటేటింగ్ డిటోనేషన్ రాకెట్ ఇంజిన్ టెక్నాలజీ హాట్ ఫైర్ టెస్టును నిర్వహించారు. ఆ ప్రారంభ పరీక్ష దాదాపు ఒక నిమిషం పాటు 4,000 పౌండ్ల ఒత్తిడిని ప్రదర్శించింది. అయితే ప్రస్తుత పరిశోధన మాత్రం లేటెస్ట్ 3D-ప్రింటెడ్ రాకెట్ టెస్టు, వివిధ థ్రస్ట్ క్లాసెస్ ఆధారంగా ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ల్యాండర్స్ అప్పర్-స్టేజ్ ఇంజిన్స్ అండ్ సూపర్‌సోనిక్ రెట్రో ప్రొపల్షన్‌తో సహా విస్తృత శ్రేణి ఇంజిన్ సిస్టమ్స్, అలాగే మిషన్‌ల పనితీరను నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు వివిధ కోణాల్లో పరిశీలించారు. ఇందులో క్లీవ్‌ల్యాండ్‌లోని నాసా యొక్క గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌లోని ఇంజనీర్లు, టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని వీనస్ ఏరోస్పేస్‌లోని పరిశోధకులు భాగస్వామ్యం అయ్యారు. కాగా ఫైనల్ పరిశోధనల తర్వాత 3D-ప్రింటెడ్ రాకెట్‌ ద్వారా అంగారక గ్రహాన్ని చేరుకోవడం చాలా సులువు అవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. 


Similar News