లైట్ల వెలుతురులోకి కీటకాలు ఎందుకు వస్తాయి?.. రహస్యమిదే!

రాత్రిపూట బయట వీధుల్లోనో, ఇండ్లల్లోనో వెలుగుతున్న విద్యుత్ దీపాల వెలుతురులో గుంపులుగా చేరే వివిధ కీటకాలను మీరు గమనించారా? ఎందుకలా చేరుతాయి? కృత్రిమ వెలుతురుకు, కీటకాలకు మధ్య ఉన్న ఆకర్షణ ఏమిటి?

Update: 2024-01-31 13:56 GMT

దిశ, ఫీచర్స్ : రాత్రిపూట బయట వీధుల్లోనో, ఇండ్లల్లోనో వెలుగుతున్న విద్యుత్ దీపాల వెలుతురులో గుంపులుగా చేరే వివిధ కీటకాలను మీరు గమనించారా? ఎందుకలా చేరుతాయి? కృత్రిమ వెలుతురుకు, కీటకాలకు మధ్య ఉన్న ఆకర్షణ ఏమిటి? ఇప్పటి వరకు ఈ విషయంలో చాలామందికి సైంటిఫిక్ క్లారిటీ లేదు. కాకపోతే ఏండ్ల తరబడి ప్రబలంగా ఉన్న థియరీ ప్రకారం.. ఖగోళ వస్తువుల కోసం లైట్లను తప్పుగా భావించడం వల్ల లేదా లైట్ల కాంతితో విడుదలయ్యే వేడిలో వెచ్చదనం కోసం కీటకాలు ఆర్టిఫిషియల్ లైటింగ్‌ను ఆశ్రయిస్తాయి. అయితే ఇదొక ఊహ మాత్రమే. కానీ తాజాగా ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అండ్ ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలోని మెక్‌గ్యురే సెంటర్ ఫర్ లెపిడోప్టెరా అండ్ బయోడైవర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం దీనిపై కొత్త థియరీని ముందుకు తెచ్చింది.

కీటకాలు కృత్రిమ కాంతికి ఎందుకు ఆకర్షితం అవుతాయనే విషయంలో పరిశోధకుల బృందం క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే.. కీటకాలు ఆర్టిఫిషియల్ కాంతివల్ల అట్రాక్షన్ అవడానికి కారణం గత థియరీలు పేర్కొన్నట్లు ఖగోళ వస్తువులను తప్పుగా భావించడం ఏమాత్రం కాదు. ఓరియంటేషన్ ప్రాబ్లంవల్లే అవి లైట్లవద్ద వెలుతురులో గుమిగూడుతాయి. ఓరియెంటేషన్ అనేది సమయం, ప్రదేశం, వ్యక్తి అనే మూడు కోణాలపై అవగాహన కలిగి ఉండే ఒక మానసిక స్థితి. దిక్కుతోచని స్థితికి దారితీస్తుంది. కీటకాల్లోనూ అదే సంభవిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోడానికి తాము కోస్టా రికన్ ఫారెస్టులో కీటకాల ఫ్లైట్ అరెనాలో హై-స్పీడ్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించి ప్రయోగాలు చేశామని పరిశోధకుడు యష్ సోంధీ తెలిపారు.


Similar News