50,907 డైమండ్స్ పొదిగిన అద్భుతమైన రింగ్.. హెచ్.కె. డిజైన్స్ గిన్నిస్ రికార్డ్
డైమండ్ రింగ్స్ ఎవరినైనా ఆకట్టుకుంటాయి.
దిశ, ఫీచర్స్ : డైమండ్ రింగ్స్ ఎవరినైనా ఆకట్టుకుంటాయి. కానీ అత్యధికంగా 50,907 వ్రజాలతో రూపొందిస్తే.. అదో అద్భుతంగా నిలుస్తుంది. ప్రస్తుతం ముంబైకి చెందిన ఒక జువెల్లర్ అదే చేశాడు. గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ అట్రాక్టివ్ డైమండ్ రింగ్‌ను తయారు చేసినందుకు గాను హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అండ్ హెచ్.కె డిజైనర్స్‌కు ఈ గౌరవం దక్కింది. నగల వ్యాపారులు మొదటిసారిగా ‘ఒక ఉంగరంలో అత్యధిక వజ్రాలు అమర్చిన’ రికార్డును కైవసం చేసుకునేలా చేసింది. మరో విషయం ఏంటంటే.. ఈ రింగ్ పూర్తిగా రీసైకిల్ చేసిన మెటీరియల్స్‌తో తయారు చేయబడింది. ఇందులో మొత్తం 8 పార్ట్స్ ఉండగా, 4 పొరల రేకులు, షాంక్, రెండు డైమండ్ డిస్క్‌లు, ఒక సీతాకోక చిలుక ఉన్నాయి. ఇందులోని ప్రతీ డైమండ్ ఎక్స్‌పర్ట్స్ టీమ్ ద్వారా సెట్ చేయబడింది. ఈ రింగ్ రూపొందించిన హెచ్ కె. (h.k) డిజైనర్స్ హరి కృష్ణ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇది 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేజర్ రిటైలెర్స్ అండ్ హోల్ సేల్లర్స్‌కు డైమండ్స్ సప్లయ్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ SWA డైమండ్స్ వారి అమీ మష్రూమ్-షేపుడ్ రింగ్ 24,679 వజ్రాలతో రికార్డుకెక్కింది. కానీ ఇప్పుడు హెచ్.కె డిజైనర్స్ దానిని అధిగమించింది. అద్భుతమైన ఈ రింగ్ ధర సుమారు 785,645 డాలర్లు (రూ. 6.4 కోట్లు). ఐడియేషన్ నుంచి క్రాఫ్టింగ్ వరకు ఈ డైమండ్ రింగ్ తయారు చేసేందుకు 9 నెలల సమయం పట్టింది. 50, 907 డైమండ్స్‌ను అమర్చే క్రమంలో నిపుణులు చాలా ఆలోచించారు. ఫైనల్‌గా డైమండ్ రింగ్‌పై భాగంలో సన్ ఫ్లవర్ ఆకారం, అందులో పొదిగిన వజ్రాలు, పైభాగంలో సీతాకోక చిలుక కూర్చొని ఉండేలా అద్భుతంగా రూపొందించడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
డిప్రెషన్‌కు చెక్ పెడుతున్న ఫిజికల్ యాక్టివిటీస్.. అధ్యయనంలో వెల్లడి