Most Dangerous Countries : మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు.. ఇండియా ఏ ప్లేస్ లో ఉందంటే..

వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. మహిళల విషయంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల గురించి ప్రకటించింది. ఉమెన్స్ డేంజర్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాను అందించింది. ఇందులో తొలి స్థానంలో

Update: 2024-08-27 07:10 GMT

దిశ, ఫీచర్స్ : వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ లిస్ట్ రిలీజ్ చేసింది. మహిళల విషయంలో అత్యంత ప్రమాదకరమైన దేశాల గురించి ప్రకటించింది. ఉమెన్స్ డేంజర్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాను అందించింది. ఇందులో తొలి స్థానంలో వెయ్యికి 771. 82 స్కోర్ తో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా... బ్రెజిల్ 624. 28తో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇంచుమించు అదే స్కోర్ (592.71)తో రష్యా మూడో స్థానంలో కొనసాగుతోంది. మెక్సికో 576. 05 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా... 553.11 స్కోర్ తో ఇరాన్ ఐదో స్థానంలో ఉంది. ఈ దేశాల్లో ఉమెన్స్ సేఫ్టీ, జెండర్ ఈక్వాలిటీ గురించి కచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

ఇక పైన చెప్పిన దేశాలు టాప్ 5లో ఉండగా.. మహిళను హింసించడంలో మన దేశం టాప్ టెన్ లో ఉంది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ రిపోర్ట్ 50 దేశాలకు సంబంధించిన జాబితా ఇవ్వగా.. అందులో తొమ్మిదో స్థానంలో ఉంది భారత్. ఇక ఇండియాలో క్రైమ్ రేట్ 2014లో 56.4 ఉంటే 2022లో 66.4కు చేరింది. తాజాగా కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనతో మరోసారి దేశంలో ఉమెన్ సేఫ్టీ గురించి ఆందోళనలు మొదలయ్యాయి.

Tags:    

Similar News