ఆ టాటూతో పునర్జన్మ.. సింబల్‌కో నమ్మకం! ట్రెండ్‌గా మార్చుకున్న యువత

మెంటల్ హెల్త్ టాటూస్.. ప్రస్తుతం ఫాల్లో అవుతున్న ట్రెండీ ఫ్యాషన్లలో ఒకటి. భుజాలు, మెడ, గుండె, వీపు, కాళ్లపై రకరకాల

Update: 2023-05-10 10:18 GMT

దిశ, ఫీచర్స్: మెంటల్ హెల్త్ టాటూస్.. ప్రస్తుతం ఫాల్లో అవుతున్న ట్రెండీ ఫ్యాషన్లలో ఒకటి. భుజాలు, మెడ, గుండె, వీపు, కాళ్లపై రకరకాల టాటూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని భావిస్తుంటారు కొందరు యువతీ యువకులు. అయితే వీటిని కేవలం లుక్స్ కోసమే కాకుండా వాటి వెనుక ఉన్న సానుకూల, అంతర్గత ప్రత్యేకతలను బట్టి కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. అనేక రకాల డిజైన్లలో కనిపించే టాటూలలో ఒక్కో డిజైన్‌కు ఒక్కో స్పెషాలిటీ ఉండగా.. ఈ పచ్చబొట్టు వేసుకోవడంవల్ల తమ కష్టాలు, మానసిక అనారోగ్యాలు దూరం అవుతాయని, ఆటంకాలను అధిగమించే శక్తి లభిస్తుందని నమ్ముతుంటారు. మెంటల్ హెల్త్ టాటూస్ స్వయం సంరక్షణ ప్రయారిటీని కలిగి ఉంటాయని.. వ్యక్తులు తమ శ్రేయస్సుపై శ్రద్ధ వహించడానికి రిమైండర్ సింబల్స్‌గానూ పనిచేస్తాయని టాటూస్ డిజైనర్స్ అంటున్నారు. వ్యక్తులు భావాలను, భావోద్వేగాలను వ్యక్త పరచడానికి ఇవి ఒక మార్గంగా నిలుస్తుండగా.. అలాంటి మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ ట్రెండీ టాటూస్‌ గురించి తెలుసుకుందాం.

1. ఇన్ఫినిటీ ట్రయాంగిల్ టాటూ

అప్రిషియేటివ్ అండ్ మినిమలిస్టిక్ టాటూ డిజైన్ కోసం చూస్తున్న వారికి ‘ఇన్ఫినిటీ ట్రయాంగిల్’ గ్రేట్ ఆప్షన్. త్రిభుజాకారంలో ఉన్న రెండు పవర్ ఫుల్ సింబల్స్ కలయికగా ఉండే టాటూ.. సమతుల్యం, సామరస్యం, దృఢ చిత్తానికి నిదర్శనం. పాజిబిలిటీస్ అండ్ ఎండ్ లెస్‌నెస్ సామర్థ్యానికి ప్రతీక. అవకాశాలు, అంతులేనితనాన్ని సూచించే ఈ పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తులు తమ శారీరక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శ్రేయస్సుతో సహా తమ జీవితంలో ఆరోగ్యకరమైన సమతుల్యతను కొనసాగించడానికి నిజమైన రిమైండర్‌గా పనిచేస్తుంది. చాలా అందంగాను కనిపించే టాటూను.. నిరాశకు గురైనప్పుడు ఒక్కసారి చూస్తే దాని వెనుకున్న కథనం ప్రకారం.. మీరు బలంగా, స్థిరమైన మనస్తత్వం కలవారిగా బూస్ట్ అవుతారు.

2. బట్టర్ ఫ్లయ్ టాటూ

మెంటల్ హెల్త్ ప్రపంచంలో ఒక సీతాకోక చిలుక ఆకారం కలిగిన అందమైన టాటూ అద్భుతంగా పనిచేస్తుంది. మొదటి చూపులో(At first glance) ఇది కేవలం ఒక బ్యూటిఫుల్ డిజైన్ లాగా అనిపించవచ్చు. కానీ చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి మీరు ఆకర్షణీయమైన టాటూను కోరుకుంటున్నట్లయితే దీనిని ఎంచుకోవచ్చు. రూపాంతరం, పునర్జన్మ, పునరుద్ధరణకు ప్రసిద్ధి గాంచిన ఈ టాటూ.. భవిష్యత్తుపట్ల సానుకూలతను కలిగించే సింబల్. ఎందుకంటే బట్టర్‌ఫ్లయ్ పరివర్తన ప్రక్రియ ద్వారా వెళ్లి అందమైన, శక్తివంతమైన జీవిగా ఉద్భవించింది కదా. సో ఇది మీ స్కిన్‌పై ఒక చిన్న పర్సనల్ చీర్‌లీడర్‌ను కలిగి ఉండటం వంటిది. కాగా అది జీవితంలోని హెచ్చు తగ్గుల నుంచి బాధపడకుండా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది.

3. ఫ్రీ బర్డ్ టాటూ

సెన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్‌‌లో బాగా ప్రాచుర్యం పొందింది ‘ఫ్రీ బర్డ్’ టాటూ. ఇది విముక్తికి చిహ్నం. ప్రతికూల ఆలోచనలు లేదా మనల్ని వెనక్కి నెట్టివేసే పరిస్థితుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. మన ఆశల రెక్కలను విప్పి కలల వైపు ఎగరడానికి ఒక రిమైండర్. ఫ్రీ బర్డ్ ఇమేజ్‌తో ఇంక్ వేయించుకోవడం మెంటల్ అండ్ ఎమోషనల్ ఫ్రీడమ్ సాధించడం, అడ్డంకులను అధిగమించడం, అంతర్గత శాంతిని(inner peace) కనుగొనడం వంటి అంశాలకు ప్రతీకగా నిలుస్తుంది. మానసిక ఆరోగ్య సవాళ్లు ఉన్న కొంతమంది వ్యక్తులకు, ఫ్రీ బర్డ్ టాటూ ప్రతికూల భావోద్వేగాల నుంచి విముక్తి కలిగిస్తుందట. లైఫ్‌లో కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈ టాటూను ఒక్కసారి చూస్తే స్వేచ్ఛ, ఆనందంతో నిండిన జీవితాన్ని గడపగలిగే శక్తి లభిస్తుందని నమ్ముతారు.

 

 4. సెమికోలన్ టాటూ

మెంటల్ హెల్త్ అవేర్ నెస్, ఆత్మహత్యల నివారణకు అత్యంత ప్రసిద్ధ చెందిన చిహ్నాలలో సెమికోలన్ టాటూ ఒకటి. ఈ స్మాల్ పంక్చుయేషన్(punctuation) మార్క్ మెంటల్ ఇల్‌నెస్‌తో పోరాడుతున్న వారికి పవర్ ఫుల్ మెసేజ్ అందిస్తుంది. సెమికోలన్ ముగింపును కాకుండా వాక్యంలో విరామాన్ని సూచిస్తుంది. మానసిక అనారోగ్యం, దానిని అనుభవిస్తున్న వారి సందర్భంలో సెమికోలన్ తన జీవిత కథను అకాలంగా ముగించకుండా కొనసాగించడానికి వ్యక్తి ఎంపికను సూచిస్తుంది. ఇది వ్యక్తులను ఆశావాదం వైపు నడిపిస్తుంది. జీవితంపై విరక్తితో ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.

 

 5. చెవ్రాన్ టాటూ

ఈ ఫన్ అండ్ ప్లే ఫుల్ డిజైన్ సింపుల్ ఫ్యాషన్ స్టేట్‌‌మెంట్ మాత్రమే కాదు లోతైన అర్థాన్ని కూడా కలిగి ఉంది. ఇది రియలైజేషన్‌కు సింబల్ వంటిది. జీవితంలో ఎదురయ్యే తుఫానుల వంటి ఆటంకాలను తట్టుకునే శక్తి మనకు ఉందని గుర్తుచేస్తుంది. చెవ్రాన్లు సాధారణంగా మిలటరీ, లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చిహ్నాలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. అవి వైవిధ్యాన్ని బట్టి డిప్రెషన్, యాంగ్జైటీ టాటూస్‌గా కూడా ఉపయోగపడతాయి. ఈ మోటివేటింగ్ టాటూ డైరెక్షన్ అండ్ ప్రోగ్రెస్ కోసం నిలబడుతుంది. ఇబ్బందులను, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌ను అధిగమించడానికి ఒక వ్యక్తి సంకల్పాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంకా చెవ్రాన్ పైకి సూచించే దిశ(upward-pointing direction of the chevron) మేల్కొలుపునకు నిదర్శనం.

 

 6. హార్ట్‌బీట్ టాటూ

హార్ట్‌బీట్ టాటూ అనేది జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ మానసిక, శారీరక ఆరోగ్యపరమైన ఇబ్బందులను, సవాళ్లను అధిగమించి శక్తివంతంగా ఉద్భవించవచ్చని గుర్తు చేస్తుంది. ఈ టాటూను సింబల్ ఆఫ్ లైఫ్‌గా పేర్కొంటారు. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని, మన ఉనికిని చాటాలని గుర్తుచేస్తుంది. మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఇతరుల నుంచి సాంత్వన(solace), మద్దతు పొందేందుకు సూచికగానూ ఈ టాటూను పరిగణిస్తారు.

 

 7. ఇన్‌స్పిరేషనల్ కోట్ టాటూ

మెంటల్ ఇల్‌నెస్‌ సమస్యను అధిగమించేందుకు అవసరమైన స్ఫూర్తిని పొందేందుకు ఇన్‌స్పిరేషనల్ కోట్ టాటూ వేసుకుంటారు. ఇది వ్యక్తి అంతర్గత ధైర్యం(inner courage), రియలైజేషన్, ప్రేరణ(motivation)ను గుర్తుచేస్తాయి. అలాగే మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి వ్యక్తులను ప్రోత్సహించే, శక్తివంతం చేసే సానుకూల ధృవీకరణగా(positive affirmations) పనిచేస్తుంది. ఈ టాటూ పాజిటివ్‌గా ఉండటానికి, ఎలాంటి సవాళ్లు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగడానికి రోజువారీ రిమైండర్‌గా పనిచేస్తుంది. మనం ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న స్ఫూర్తిని తీసుకువెళ్లడానికి ఈ టాటూ తోడ్పడుతుంది. ఇతరులు ఈ టాటూస్‌‌ను చూసినప్పుడు కూడా, అది సంభాషణలను రేకెత్తిస్తుంది. కమ్యూనిటీ పట్ల అవగాహన భావాన్ని పెంపొందిస్తుంది.

 Also Read...

చనిపోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్ ఏమవుతుంది?

 

 

Tags:    

Similar News