ఇవి నేర్చుకున్నాకే పెళ్లికి రెడీ అవ్వండి.. లేదంటే ఆ విషయంలో సుఖం ఉండదు..

పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇద్దరు మనుషుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది.

Update: 2024-01-24 16:00 GMT

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇద్దరు మనుషుల నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుని తీరాల్సిందే. దీంతో వారి జీవితంలో ఓ కొత్త వ్యక్తి ప్రవేశిస్తుంది. వారితో అన్నీ షేర్ చేసుకుంటూ జీవితాంతం గడపాల్సిందే. అయితే పెళ్లి చేసుకునే ముందు పురుషులు కొన్ని విషయాలను తప్పకుండా నేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు.

జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించిన నిర్ణయాలను పెళ్లి కాకముందు ఎలా తీసుకున్నా పెళ్లి అయ్యాక మాత్రం భాగస్వామితో సంప్రదించాకే తీసుకోవాలి. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాల గురించి ఇద్దరూ మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలి. అలా ఏ నిర్ణయమైనా ఒంటరిగా తీసుకోకూడదని, ఇలా చేయడం వలన ఇరువురికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు పెళ్లికి ముందు చేసినట్టుగా అతిగా ఖర్చులు చేయడం ఆపేయాలట. ఆన్‌లైన్‌లో దేన్నైనా ఆర్డర్ చేసుకోవాలన్నా తమ భాగస్వామికి కచ్చితంగా చెప్పాలని చెబుతున్నారు.

పెళ్లి అయ్యాక స్నేహితులతో కాకుండా ఎక్కువ సమయం భార్యతోనే గడపాలట. ఫ్రెండ్స్ తో బాతాకాని కాస్త తగ్గించి భార్యతో మాట్లాడాలట. బయట ఎక్కువ సేపు తిరగకుండా ఇంట్లో ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చెబుతున్నారు. ఉదయం భార్యకి పనుల్లో ఆసరాగా ఉండాలట. కొత్తగా వచ్చిన అమ్మాయి అందరిలో కలిసేవరకు తను ఒంటరిగా ఫీలవకుండా ఉండేలా చూడాలట. భార్య ఒంటరితనాన్ని పోగొట్టేందుకు తనతోనే ఎక్కువ సమయం గడపాలని నిపుణుల అభిప్రాయం. లేదంటే ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూ మనశ్శాంతి లేకుండా జీవితం గడపాల్సి వస్తుందట.

Tags:    

Similar News