ఆహారాన్ని మింగుతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఏంటి?.. తినడాన్ని కంటిన్యూ చేసేందుకు లేదా ఆపేందుకు హార్మోన్ల పాత్ర ఉందా?
యూనివర్శిటీ ఆఫ్ బాన్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తినే ప్రక్రియలో ఒక ముఖ్యమైన కంట్రోల్ సర్క్యూట్‌ను గుర్తించారు. ఫ్లై లార్వా అన్నవాహికలో ప్రత్యేక సెన్సార్లు లేదా గ్రాహకాలు కలిగి ఉందని అధ్యయనం వెల్లడించింది, అవి ఏదైనా మింగిన వెంటనే ప్రేరేపించబడతాయి. అంటే లార్వా ఆహారాన్ని మింగినట్లయితే.. సెరోటోనిన్‌ను విడుదల
దిశ, ఫీచర్స్ : యూనివర్శిటీ ఆఫ్ బాన్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తినే ప్రక్రియలో ఒక ముఖ్యమైన కంట్రోల్ సర్క్యూట్‌ను గుర్తించారు. ఫ్లై లార్వా అన్నవాహికలో ప్రత్యేక సెన్సార్లు లేదా గ్రాహకాలు కలిగి ఉందని అధ్యయనం వెల్లడించింది, అవి ఏదైనా మింగిన వెంటనే ప్రేరేపించబడతాయి. అంటే లార్వా ఆహారాన్ని మింగినట్లయితే.. సెరోటోనిన్‌ను విడుదల చేయమని మెదడుకు చెబుతాయి. ఈ మెసెంజర్ పదార్థమే.. తరచుగా ఫీల్-గుడ్ హార్మోన్ లేదా లవ్ హార్మోన్అని కూడా పిలువబడుతుంది. లార్వాను తినడాన్ని కంటిన్యూ చేయాలని చెప్తుంది. ఇలాంటి ప్రాసెస్ మనుషుల్లోనూ జరుగుతుందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.
మన ముందు మనకు నచ్చిన ఫుడ్ ఉందనుకోండి. వెంటనే నోట్లో పెట్టుకోవాలనే ఆశ కలుగుతుంది. సువాసన.. రుచి ఎలా ఉందో చూడాలని ప్రేరేపిస్తుంది. ఒక్క బైట్ నోట్లో వేసుకుని, మింగిన తర్వాత ఆహా అనిపిస్తుంది. మరింత తినాలనే కుతూహలం వచ్చేస్తుంది. తినడం కంటిన్యూ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఏ న్యూరల్ సర్క్యూట్స్ ఇందుకు బాధ్యత వహిస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
ఫ్రూట్ ఫ్లై డ్రోసోఫిలా లార్వాలను అధ్యయనం చేయడం ద్వారా... ఈ ఈగలు దాదాపు 10,000 నుంచి 15,000 నాడీ కణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇవి మానవ మెదడులో 100 బిలియన్ల వరకు ఉండొచ్చు. కాగా ఈ 15,000 నాడీ కణాలు చాలా సంక్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి. ప్రతి న్యూరాన్ బ్రాంచ్ ప్రొజెక్షన్‌లను కలిగి ఉంటుంది. దీని ద్వారా డజన్ల కొద్దీ లేదా వందల కొద్దీ ఇతర నాడీ కణాలను సంప్రదిస్తుంది. ఫ్లై లార్వాలోని అన్ని నరాల కనెక్షన్‌లు పరిశోధించిన శాస్త్రవేత్తలు.. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణవ్యవస్థ మెదడుతో ఎలా కమ్యూనికేట్ చేస్తుందనే దానిపై పూర్తి వివరణ ఇచ్చారు.
స్ట్రెచ్ రిసెప్టర్ సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేయగల లార్వా మెదడులోని ఆరు న్యూరాన్‌ల సమూహానికి వైర్ చేయబడిందని గుర్తించారు. మంచి నాణ్యమైన ఆహారాన్ని గుర్తించినట్లయితే మాత్రమే అవి సెరోటోనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది లార్వా తినడం కొనసాగుతుందని నిర్ధారిస్తుంది. ఒకవేళ ఫుడ్ బాగా లేనట్లయితే లవ్ హార్మోన్ రిలీజ్ కాదు. ఇక ఈ సర్క్యూట్ లోపభూయిష్టంగా ఉంటే... అనోరెక్సియా లేదా అతిగా తినడం వంటి ఫుడ్ డిజార్డర్ కు కారణమవుతుంది.