ఈ చెట్టు ఆకుల రసం ఒక గ్లాస్ తాగితే చాలు.. ఆ రోగాలన్నీ పరార్
దీనిలో పోషకాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.
దిశ, ఫీచర్స్: బొప్పాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో పోషకాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ శరీరంలోని హానికరమైన అమినో యాసిడ్‌లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి మాత్రమే కాకుండా ఈ చెట్టు ఆకులు కూడా మన శరీరాన్ని కాపాడతాయి. ఎందుకంటే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. ఇంకా ఈ ఆకు రసంతో కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా బొప్పాయి ఆకు రసం తాగిస్తారు. ఇది రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.
2. బొప్పాయి చెట్టు ఆకుల రసం జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఎంజైమ్‌లు వాటి శోథ నిరోధక లక్షణాల ద్వారా మంటను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో నీరు, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
2. బొప్పాయి ఆకుల్లో ఉండే పపైన్‌కు ప్రత్యేకమైన ఔషధ విలువలు లేవు. దీనితో దెబ్బ తగిలిన చోట గాయాలను కూడా నయం చేయవచ్చు. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
4. ఈ ఆకు రసం సిద్ధం చేసే ముందు, బొప్పాయి ఆకులను కడిగి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వడపోసి తీసుకోవాలి. అధికంగా తీసుకోరాదు.. మితంగా మాత్రమే తీసుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.