Chandrayaan-3: జాబిల్లి చెంతన చల్లదనమెంత?.. ఉపరితలంపై ఏం జరుగుతోంది?
చంద్రయాన్ -3 సక్సెస్ తర్వాత జాబిల్లికి సంబంధించిన ప్రతీ విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
దిశ, ఫీచర్స్: చంద్రయాన్ -3 సక్సెస్ తర్వాత జాబిల్లికి సంబంధించిన ప్రతీ విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. విక్రమ్ ల్యాండర్ అక్కడ దిగడం మొదలు పెడితే అది పంపే పిక్చర్స్‌కు సంబంధించిన ప్రతీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ముఖ్యంగా చంద్రుడిపై వెదర్ ఎలా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ‘చల్లని రాత్రి, వెన్నెల రేయి’ అంటూ మనం చదివిన చందమామ కథల్లో మాదిరిగానే ఉంటుందా? మరోలా ఉంటుందా? అనే సందేహాలు తలెత్తుతుండగా ఇస్రో వాటిని క్లారిఫై చేస్తోంది. రీసెంట్‌గా దక్షిణ ధ్రువ ప్రాంతంలోని వాతావరణం, ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తమకు అందినట్లు ఇస్రో సైంటిస్టులు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించారు.
చంద్రుడిపై ఓన్లీ కూల్ వెదర్ గానీ, ఓన్లీ హీట్ వెదర్‌గానీ ఉండదు. కొన్నిసార్లు ఈ రెండూ మిళితమైన డిఫరెంట్ వెదర్ ఉంటుందని, ఆయా సందర్భాల్లో వాతావరణ వైరుధ్యాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఉదాహరణకు ఉపరితలం చల్లగా ఉంటే.. అదే ఉపరితలంపై 10 సెంటిమీటర్ల లోతుల్లోకి తవ్వితో వేడిగా ఉంటుందని ఇస్రో సైంటిస్టుల విశ్లేషణలో తేలింది. అంటే ఇక్కడ ఏకకాలంలో చలి, వేడి లేదా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలను సందర్శించవచ్చు. విక్రమ్ ల్యాండర్‌లోని థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ (CHASTE)పేలోడ్ పంపిన డేటా ప్రకారం చంద్రుడిపై ఉపరితలాన్ని తవ్వితే మైనస్ 10 నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చూడవచ్చని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. పైగా ఉపరితలానికి, దానికి సమీపంలో లోతులకు వాతావరణ వైరుధ్యం ఉందని, లోతుల్లోకి పోయేకొద్దీ వేడిగాను, పైకి వచ్చేకొద్ది చల్లగాను ఉంటుందని పేర్కొన్నారు.