బాధ్యతల నిర్వహణ కష్టమా.. 16% మందికి బయోడేటా నింపడం కూడా రాదట

ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా ఉంటాడనేది అతని ప్రవర్తన, వ్యక్తిత్వం, చేసే పనులను బట్టి తెలిసిపోతుంది. అలాగని వాటిని నిర్వహించడం కూడా అంత సులువు కాదు.

Update: 2024-01-16 08:08 GMT

దిశ, ఫీచర్స్ : ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా ఉంటాడనేది అతని ప్రవర్తన, వ్యక్తిత్వం, చేసే పనులను బట్టి తెలిసిపోతుంది. అలాగని వాటిని నిర్వహించడం కూడా అంత సులువు కాదు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఈ పనులు చేయడం చాలా కష్టమని భావిస్తుంటారు. ఇలా భావించే వారిలో అత్యధికమంది 18 నుంచి 25 ఏండ్లలోపు వారే ఉంటున్నారని ఇటీవల ఒక ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ముఖ్యంగా 27 నుంచి 42 ఏండ్లలోపు వయస్సుగల వారిలో 63 శాతం మంది తమ కుటుంబ, సామాజిక, వ్యక్తిగత బాధ్యతల నిర్వహణలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ యువతీ యుకుల్లో 16 శాతం మందికి ఇప్పటికీ టై కట్టుకోవడం, హుక్స్ పెట్టుకోవడం, బయోడేటా నింపడం, బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయడం, చెక్కు రాయడం వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం రాదని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు పేర్కొంటున్నారు. మిలీనియల్స్‌లో కూడా 28 శాతం మంది తల్లులకు తమ పిల్లలకు డైపర్ మార్చడం రాదట. మరో 42 శాతం మందికి తమ దుస్తులు చినిగితే కుట్టుకోవడానికి రాదట. 62 శాతం మందికి తమ బైకులు లేదా కారులో ఆయిల్ మార్చడం, పంక్చర్ అయినప్పుడు టైర్ మార్చడం తెలీడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే..30 ఏండ్లలోపు వయస్సుగలవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరికి డబ్బు నిర్వహణ, ఖర్చుల విషయంలో బాధ్యతగా ఉండటం చాలా కష్టంగా అనిపిస్తోందట.


Similar News