దేవుడిని మీట్ అయ్యా.. స్వర్గంలో భూముల ధరలు ఇట్లున్నాయి...

మెక్సికోకు చెందిన చర్చ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ టైమ్స్ పాస్టర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాడు. తను 2017లో దేవుడిని కలిశానని.. ఆయన ఆశీర్వాదంతో దైవిక ఆమోదం పొందానని చెప్తున్నాడు. అక్కడే తను ఉండేందుకు ఆల్రెడీ స్థలం కూడా కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు.

Update: 2024-06-30 15:03 GMT

దిశ, ఫీచర్స్: మెక్సికోకు చెందిన చర్చ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ టైమ్స్ పాస్టర్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాడు. తను 2017లో దేవుడిని కలిశానని.. ఆయన ఆశీర్వాదంతో దైవిక ఆమోదం పొందానని చెప్తున్నాడు. అక్కడే తను ఉండేందుకు ఆల్రెడీ స్థలం కూడా కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు. నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి బంగారు కిరణాల మధ్య ఉన్న భవనం దగ్గర నిల్చున్న ఫొటోలు షేర్ చేశాడు. స్వర్గంలో ప్లాట్లు అమ్మే బాధ్యత దేవుడు తనకే ఇచ్చాడని.. చదరపు మీటరుకు రూ. 8000 చొప్పున కొనుగోలు చేయొచ్చని ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. ముందుగా బుక్ చేసుకున్న వారికి దేవుడి భవనం పక్కనే సెట్ చేస్తామన్నాడు. PayPal, Gpay, Visa Mastercard లాంటి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ఆమోదిస్తామని... స్వర్గంలో ఈ ప్లాట్లను అమ్మడం ద్వారా 2017 నుంచి మిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపాడు.

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ తో వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ స్లామ్ ' , 'పిచ్చి బాగా ముదిరింది. నైజీరియన్లకు మించి పోయారు ', ' ఈ నకిలీ భక్తులు దేవుడిని కూడా విక్రయిస్తారు ' అని కొందరు తిడుతుంటే.. ఇంకొందరు ' అక్కడ మెటావర్స్ నిర్మాణం జరుగుతుందా? ' అని అడుగుతున్నారు. 


Similar News