అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డే..

దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డే (IAAD)ను ప్రతి ఏటా జూన్ 13న జరుపుకుంటాం..Latest Telugu News

Update: 2022-06-13 04:35 GMT

దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డే (IAAD)ను ప్రతి ఏటా జూన్ 13న జరుపుకుంటాం. అల్బినిజం (మెలనిన్ తక్కువగా) ఉన్న వ్యక్తుల హక్కులను కాపాడేందుకు ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తుండగా.. ఇటీవల కాలంలో అల్బినిజం ఉన్నవారిపై హింసాత్మక దాడులు, హత్యలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు ప్రకటించాయి.

దీంతో అంతర్జాతీయ స్థాయిలో కెనడియన్ NGO 'అండర్ ది సేమ్ సన్' (UTSS), ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వారి హక్కులను పరిరక్షించేందుకు జూన్ 13ను అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డేగా ప్రకటించాలని మానవ హక్కుల మండలి సిఫార్సు చేసింది. దీంతో టాంజానియా అల్బినిజం సొసైటీ (TAS), ఇతర NGOలు అల్బినిజం ఉన్న వ్యక్తుల హక్కుల కోసం ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగానే 2006 మే 4న 'టీఏఎస్' మొదటి అల్బినో డేను జరుపుకుంది. అలా 2009 నుంచి నేషనల్ అల్బినో డేగా మారిన ఈ రోజు చివరకు 2015 జూన్ 13 నుంచి అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డేగా మారింది.


Similar News