Land Of Snakes : ఆ ఊరిలో మనుషుల కన్నా పాములే ఎక్కువ.. ఒక్కరినీ కాటు వేయలేదంటే నమ్మండి..
పాము అన్న పేరు వినగానే కొందరికి భయంతో ఒళ్లు జలదరిస్తుంది. ఇంటి పరిసరాల్లో కనిపిస్తే గనుక అక్కడి నుంచి పారిపోవడమే తరువాయి. కానీ ఇందుకు భిన్నంగా మహారాష్ట్రలోని, షోలాపూర్ జిల్లాలో పూణే నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గల
దిశ, ఫీచర్స్ : పాము అన్న పేరు వినగానే కొందరికి భయంతో ఒళ్లు జలదరిస్తుంది. ఇంటి పరిసరాల్లో కనిపిస్తే గనుక అక్కడి నుంచి పారిపోవడమే తరువాయి. కానీ ఇందుకు భిన్నంగా మహారాష్ట్రలోని, షోలాపూర్ జిల్లాలో పూణే నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో గల షెట్‌పాల్ గ్రామస్తులు పాములతో కలిసి జీవిస్తున్నారు. వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. స్నేక్స్ గ్రామంలో స్వేచ్ఛగా విహరిస్తుండగా.. పిల్లలు కూడా వాటితో ఆడుకుంటుంటారు. కానీ అవి ఎవరినీ కాటు వేయవు. ఇప్పటి వరకు ఈ గ్రామంలో పాము కాటుకు గురైన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరట. ఇక్కడందరూ స్నేక్ లవర్సే కాబట్టి ఆ గ్రామాన్ని పలువురు ‘ల్యాండ్ ఆఫ్ స్నేక్’ అని కూడా పిలుస్తున్నారు.
విశేషం ఏంటంటే.. షెట్‌పాల్ గ్రామస్తులు ప్రతీ ఒక్కరు తమ ఇంటిలో పాముల కోసం ఒక ప్రత్యేక నివాసం కూడా ఏర్పాటు చేస్తారు. వాటికి ఆహారం ఇవ్వడం, జాగ్రత్తలు తీసుకోవడం చేస్తుంటారు. పైగా ఆ గ్రామంలో మనుషుల కంటే కూడా పాముల సంఖ్య అధికంగా ఉంది. ఎందుకలా అంటే.. ఈ గ్రామస్తులు పాములను పెంచుకోవడం వెనుక ఆధ్యాత్మిక భావన ముడిపడి ఉంది. అందుకే ప్రతీ నివాసంలో పాముకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. దానికోసం ఏర్పాటు చేసిన నివాసాన్ని దేవాలయంగా భావిస్తారు.
Read More..
పిల్లలు ఆరుబయట ఆడుకునే పరిస్థితి లేదా?.. స్క్రీన్ ఫ్రీ ఇండోర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించండి