మెట్ల బావిలో రహస్య గదులు.. కళ్లకు కట్టినట్టు చూపించిన అమ్మాయిలు (వీడియో)

బన్సీలాల్ పేటలో 300 ఏళ్ల నాటి నాగన్నకుంట బావి పునరుజ్జీవంతో ఔరా అనిపిస్తుంది. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు.

Update: 2023-12-20 12:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బన్సీలాల్ పేటలో 300 ఏళ్ల నాటి నాగన్నకుంట బావి పునరుజ్జీవంతో ఔరా అనిపిస్తుంది. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ బావి నుంచి దాదాపు 500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ఈ క్రమంలో పాతకాలపు కత్తులు, దేవతా విగ్రహాలు, ఇంటి సామగ్రి లభ్యమయ్యాయి. వీటన్నింటిని ఈ బావి సమీపంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఇది హైదరాబాద్‌లో అదిరిపోయే టూరిస్ట్‌ స్పాట్‌‌గా బన్సీలాల్‌పేట్‌‌లోని మెట్ల బావి మారింది. ఈ మెట్లబావిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి..? స్పెషల్ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి.


Similar News