ముఖానికి సబ్బు ఎక్కువగా పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

శరీరంపై ఉండే ధూళి, జిడ్డు అనారోగ్య సమస్యలకు, స్కిన్ ఎలర్జీకి కారణం అవుతాయి.

Update: 2024-06-30 15:53 GMT

దిశ, ఫీచర్స్: శరీరంపై ఉండే ధూళి, జిడ్డు అనారోగ్య సమస్యలకు, స్కిన్ ఎలర్జీకి కారణం అవుతాయి. కాబట్టి రోజుకు రెండు సార్లు అయినా స్నానం చేయాలని చెబుతారు నిపుణులు. కానీ శరీరానికి ఉపయోగించినట్లు సబ్బు ముఖానికి వాడకూడదు అంటున్నారు. మరి సబ్బుతో ఫేస్ వాష్ చెయ్యడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ వాష్ అనేది మన రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో ముఖ్యమైన భాగం. ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం నుండి మురికి, నూనె, మలినాలను తొలగి.. స్కిన్ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, సాధారణంగా అందరూ ముఖం కడుక్కోవటానికి సబ్బును వాడుతుంటారు. కానీ, సబ్బుతో ముఖం కడుక్కోవడం వల్ల కొన్న సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే.. సబ్బులో కఠినమైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే.. సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంలోని సహజ నూనెను పోగొట్టి ముఖం పొడిబారేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా సబ్బును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ విచ్చిన్నం అవుతుంది. అలాగే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది ముఖంపై ముడతలు, సన్నని గీతలకు కారణమవుతుంది. ఇక సబ్బు కారణంగా చర్మం ఉపరితలంపై రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణం ముఖం సహజ సౌందర్యాన్ని కోల్పోతుందని చెబుతున్నారు. 


Similar News