ఈ ఆకును పరగడుపున తీసుకుంటే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
హిందూ సంప్రదాయంలో బిల్వపత్రాన్ని పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు.
దిశ, ఫీచర్స్ : హిందూ సంప్రదాయంలో బిల్వపత్రాన్ని పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. పూజలో కూడా వీటిని ఉపయోగిస్తారు. బిల్వ పత్రాన్ని ప్రత్యేకంగా శివపూజలో ఉపయోగిస్తారు. ఈ బిల్వ పత్రాల మొక్క ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. అయితే, బిల్వ పత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని మనం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి
మన శరీర ఆరోగ్యానికి రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యం. ఇది మందగించినప్పుడు, అనారోగ్య సమస్యలు వస్తాయి. బిల్వ పత్రాలను మీ రోజువారీ జీవితంలో చేర్చుకోండి. వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ పత్రం జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సీజనల్ వ్యాధులను నివారించడానికి బిల్వ పత్రాన్ని తీసుకోండి.
గుండె ఆరోగ్యం
బిల్వ పత్రాలు గుండెకు కూడా మేలు చేస్తాయి. మీరు దీన్ని ఆహారంలో తీసుకుంటే.. మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే బిల్వ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా, అధిక రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.
డయాబెటీస్
బిల్వ పత్రం డయాబెటీస్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డయాబెటీస్‌తో బాధపడేవారు పరగడుపున వీటిని తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగతాయి.