నల్ల క్యారెట్ కిలో ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..?
నల్ల క్యారెట్‌లు గురించి ఎప్పుడైనా విన్నారా.
దిశ, ఫీచర్స్: మీరు ఎర్ర క్యారెట్‌లను తినే ఉంటారు. అయితే, నల్ల క్యారెట్‌లు గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇవి చూడటానికి నల్లగా ఉంటాయి, చాలా రుచికరమైనవి. నల్ల క్యారెట్లు పండించే రైతులకు కూడా అధిక లాభాలు వస్తాయి. సాగు చేయడానికి సరైన భూములు ఎంచుకుని రైతులు ఈ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు సాగు సాధ్యమవుతుంది. ఇది వేసిన మూడు నుంచి నాలుగు నెలల్లో కోతకు వస్తుంది.
బ్లాక్ క్యారెట్‌లో విటమిన్ ఎ, బి, సి ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా వీటిలో ఐరన్, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఈ క్యారెట్లు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం, అధిక రక్త చక్కెర, కంటి సమస్యలకు కూడా సహాయపడతాయి. ఇది రోజూ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ నల్ల క్యారెట్ తినాలి. దీన్ని పచ్చిగా కూడా తీసుకోవచ్చు.
నల్ల క్యారెట్లు పండించిన రైతులు రెండేళ్లలోనే కోట్లు సంపాదించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని సాగు చేయడానికి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. అయితే, మీరు దానిని అమ్మే సమయానికి ధర ఎక్కువగా పలుకుతుంది. మార్కెట్‌లో నల్ల క్యారెట్లు కిలో రూ. 2000 వరకు విక్రయిస్తున్నారు.