Snake: పాము శరీరంలో ఉండే ఈ భాగం ఇంట్లో పెట్టుకుంటే.. సంపదకు లోటు ఉండదట..!

మనలో చాలా మంది పాములను ( Snakes ) చూసి భయపడి పారిపోతుంటారు.

Update: 2025-03-18 14:49 GMT
Snake: పాము శరీరంలో ఉండే ఈ భాగం ఇంట్లో పెట్టుకుంటే.. సంపదకు లోటు ఉండదట..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది పాములను ( Snakes ) చూసి భయపడి పారిపోతుంటారు. అసలు, పాములు అక్కడుంటే.. ఇటు నుంచి అటు .. అటు నుంచి ఇటు పరుగులు పెడుతుంటారు. ఇక, పాములు మన ఇళ్ళలో ఎక్కడైనా కనిపిస్తే .. వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందిస్తారు. కానీ, కొందరు పాములను కొడుతుంటారు. అలా చేస్తే.. కాలసర్పదోషాలు సంభవిస్తాయని చెబుతున్నారు.

పాములు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా, ఎలుకలను వేటాడే సమయంలో.. అవి మనుషుల ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే, ఇవి చాలా అరుదుగా తన శరీరం మీద ఉన్న చర్మాన్ని వదిలేస్తుంది. అయితే, తనకు తానుగా వదిలి మళ్ళి కొత్త స్కిన్ వచ్చేలా మార్పులు చేసుకుంటుంది. 

చర్మాన్ని వదిలిసే క్రమంలో పాము ( Snakes ) చాలా కోపంగా ఉంటుందని. ఆ సమయంలో దాన్ని ఎవరైనా చేస్తే మాత్రం .. పాము పగబడుతుందని చెబుతున్నారు. అయితే.. కొందరు పండితులు దీని గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. పాముల శరీరం నుంచి విడిచిన చర్మాన్ని ఒక పెట్టెలో ఉంచి.. దానిని డబ్బులు ఉన్న బీరువాలో పెడితే.. అది ధనాన్ని ఆకర్షిస్తుందంట. అయితే, ఇది ఎవరి ఇంట్లో ఉంటే.. వారి ఇంట్లో సంపదకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News