చిన్నప్పుడు ఈ సమస్య ఉంటే పెద్దయ్యాక గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువ!
ప్రస్తుతం చాలా మంది పిల్లలు లేజీ ఐ సమస్యతో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చే జన్యులోపం లేదా ఇతర వ్యాధులలో ఇదొక్కటి. అయితే ఈ సమస్యతో పుట్టిన వారు తక్కువ చూపును కలిగి ఉంటారు.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది పిల్లలు లేజీ ఐ సమస్యతో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చే జన్యులోపం లేదా ఇతర వ్యాధులలో ఇదొక్కటి. అయితే ఈ సమస్యతో పుట్టిన వారు తక్కువ చూపును కలిగి ఉంటారు. ఒక కన్ను బలహీనంగా కనిపించడం లాంటి సమస్య ఈ వ్యాధి ఉన్న వారిలో ఉంటుంది. అయితే దీనిపై అధ్యయనం చేసిన పరిశోధకులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. లేజీ ఐ సమస్యతో బాధపడే చిన్నారుల్లో, వారు పెద్దయ్యాక గుండె పోటు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని వారు తెలిపారు. అయితే ఈ బలహీనమై కంటి చూపుతో బాధపడే వారు పెరుగుతుంటే కూడా వారిలో ఈ సమస్య అధికం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందంట.
లేజీ ఐ లేని వారితో పొలిస్తే ఈ వ్యాధి ఉన్నవారికి మధుమేహం 29%, అధిక రక్తపోటు వచ్చే అవకాశం 25%, ఊబకాయం వచ్చే అవకాశం 16% ఎక్కువ అని పరిశోధకులు చెప్పారు.అంతే కాకుండా ఈ సమస్యతో బాధపడుతున్న వారు పెద్దయ్యాక గుండె సంబంధిత వ్యాధులైన ఆంజినా లేదా స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు వారు తెలిపారు.అందువలన పుట్టిన శిశువుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, చిన్నప్పుడే ఇలాంటి సమస్యలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.