మీకు ఆ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటే ధనవంతులతో పెళ్లి అవుతుంది..!
ప్రతీ మనిషికి శరీరంలో పుట్టుమచ్చలు ఉంటాయి. నిజానికి మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ మనిషికి శరీరంలో పుట్టుమచ్చలు ఉంటాయి. నిజానికి మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. అయితే అవి ఉండే ప్లేస్‌ను బట్టి కొన్ని పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా.. అదృష్టాన్ని, దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. అయితే.. మీ శరీరంపై ఉండే పుట్టుమచ్చ మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
* నుదిటిపై పుట్టు మచ్చ ఉండే ధనవంతులు అవుతారు.
* కుడి కణతపై పుట్టు మచ్చ ఉంటే వారికి ధన లాభం, కీర్తిప్రతిష్ఠలు ఉంటాయి.
* అలాగే ఎడమ కణతపై ఉంటే అపజయాలు, దురదృష్టం కలుగుతాయి.
* కుడి కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉంటే ధనవంతులతో వివాహం జరుగుతోంది.
* ఎడమ కనుబొమ్మపై పుట్టు మచ్చ ఉంటే దురదృష్ట వంతులు అవుతారు.
* చెక్కిలిపై పుట్టు మచ్చ ఉంటే సకల భోగాలు కలుగుతాయి.
* ముక్కుపై పుట్టు మచ్చ ఉంటే కార్య సిద్ధి కలుగుతోంది.
* పెదవులపై పుట్టు మచ్చ ఉంటే వారు చమత్కారులుగా ఉంటారట.
* గడ్డం మీదా పుట్టు మచ్చ ఉంటే వారికి ధనము, కీర్తి అభిస్తాయి.