మీ పెరట్లో తేనెతుట్టె ఉందా.. అయితే మీరు అదృష్టవంతులే
తేనెటీగలన్నా, తేనెపట్టును చూసినా కొంతమంది ఆమడ దూరం పారిపోతుంటారు.
దిశ, వెబ్ డెస్క్ : తేనెటీగలన్నా, తేనెపట్టును చూసినా కొంతమంది ఆమడ దూరం పారిపోతుంటారు. అటువైపు వెళ్లడానికి కూడా సాహసం చేయరు. ఎందుకంటే తేనెటీగలు ఎలా దాడి చేస్తాయో మన అందరికి తెలుసు. కానీ నిపుణులు మాత్రం తేనెపట్టు తప్పక ఉండాలంటున్నారు.ఎందుకో ఇక్కడ చూద్దాం..
30 ఏళ్ల క్రితం తేనెటీగలు ఎక్కువగా ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం చూద్దామన్నా కూడా కనిపించడం లేదు.ఇక ముందు ముందు కనిపించకుండా పోతాయేమో? కానీ ఇవి మీ పెరట్లో ఉంటే.. మీకు డబ్బే డబ్బు అట.. ఎందుకంటే.. మీ పెరట్లో ఉండే పంటల మీద తేనెటీగలు తిరుగుతూ అధిక దిగుబడి వచ్చేలా చేస్తాయి.మీరు ఎన్ని ఎరువులు వాడినా రాని దిగుబడి.. తేనెటీగల వల్ల మాత్రమే రాగలదు.
Read More: కొబ్బరి కాయలో నీళ్లు, కొబ్బరి ఎలా ఏర్పడుతుంది..? పరిశోధనల్లో తేలిన నమ్మలేని నిజాలు