రాత్రి వేళలో నిద్రపోవడం లేదా.. అయితే మీకు ఈ వ్యాధి వచ్చినట్లే..!
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో చాలా మారులొచ్చాయి.
దిశ, వెబ్ డెస్క్ : మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవన శైలిలో చాలా మారులొచ్చాయి. పని ఒత్తిడి, విశ్రాంతి లేని జీవితం మనిషిని అగాథంలోకి తోసేస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహం ఆడ, మగ వయసుతో లేకుండా చాపకింద నీరుల వ్యాపిస్తుంది. మధుమేహం ప్రధానంగా నిద్రలేమి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుందని వైద్యులు వెల్లడించారు. మధుమేహంలో (టైప్-బీ) అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు మేలుకుని ఉండేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రంతా మేల్కొని ఉండేవారిలో జీర్ణ వ్యవస్థ క్షీణించి శరీరంలో అధిక శాతం కొవ్వు పేరుకుపోయి టైప్-బీ డయాబిటీస్ కు దారి తీస్తుంది వైద్యులు తెలిపారు.
టైప్-బీ డయాబిటీస్ అంటే..
మనిషి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ఊహించని మార్పులు సంభవించినప్పుడు టైప్-బీ డయాబిటీస్ వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో ప్యాంక్రియాస్ అవసరానికి తగినట్లుగా ఇన్సులిన్ ను జనరేట్ చేయకపోవడం టైప్-బీ డయాబిటీస్.