ఈ జీవి మనిషి మీద దాడి చేస్తే.. 20 నిమిషాల్లో ఎలాంటి వారైనా చనిపోతారు ?
విషం మొత్తాన్ని ఒకేసారి ఇంజెక్ట్ చేస్తే దాదాపు 26 మందిని చంపగలదని గుర్తించారు.
దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది పాములను చూసి భయపడి పారి పోతుంటారు. పాము నే చూసి ఇలా రియాక్ట్ అవుతుంటే.. పాము కన్నా డేంజర్ అయిన జీవులను చూస్తే ఇక అంతే సంగతి. సాధారణంగా జీవులను తక్కువ పరిమాణంతో ఉన్నావాటిని మనం అసలు అంచనా వేయలేము. చిన్న జీవుల అని వదిలేస్తే వాటి వల్ల కలిగే సంఘటనలు కూడా భారీ పరిణామాలకు దారితీస్తాయి. ఆ విధంగా, సముద్రంలో నివసించే అత్యంత ప్రమాదకరమైన చిన్న జీవి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఆ జీవి గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సైనైడ్ కంటే ఈ జీవి విషం శక్తిమంతమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ చిన్న జీవులు పాముల కంటే ప్రమాదకరం. దీనిని బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ అంటారు. ఈ జీవి ఎవరిమీద అయితే దాడి చేస్తాయో .. వారు 20 నిమిషాల్లో చనిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఈ జీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ప్రాణాంతకమైన విషం ఉన్నప్పటికీ, నీలిరంగు ఆక్టోపస్ ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా దాడి చేయదు. ఈ జీవి ఆత్మరక్షణ కోసమే విషాన్ని విడుదల చేస్తుంది. పీతల వంటి సముద్ర జీవులను చంపి తింటూ బతుకుతున్నాయి. ఈ ఆమ్లం అనేక సముద్ర జాతులలో ఉన్నప్పటికీ, నీలం-రింగ్డ్ ఆక్టోపస్ అత్యధిక స్థాయిలను కలిగి ఉంటుంది. నివేదికల ప్రకారం, విషం మొత్తాన్ని ఒకేసారి ఇంజెక్ట్ చేస్తే ఈ ఆక్టోపస్ దాదాపు 26 మందిని చంపగలదని గుర్తించారు.