స్మోకింగ్‌ చేసేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. డేంజర్ లో పడ్డట్టే..?

రోజు రోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. మనుషుల అలవాట్లు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి

Update: 2024-06-10 04:39 GMT

దిశ, ఫీచర్స్: రోజు రోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. మనుషుల అలవాట్లు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి. 10 ఏళ్ల పిల్లలు కూడా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. ఇక పెద్ద వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉదయం పనులు చేయడం, సాయంత్రానికి మందు తాగడం. మరి కొంత మంది అయితే 24 గంటలు అదే పనిగా స్మోకింగ్‌ చేస్తూనే ఉంటారు. వీరు తాగే సమయంలో ఏమి కాదు.. తాగిన కొన్ని రోజులు తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. తాజాగా స్మోకింగ్‌ చేసే వారి మీద పరిశోధనలు చేసారు. పొగ తాగే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వారి ఆరోగ్యం డేంజర్ లో పడ్డట్టే అని నిపుణులు చెబుతున్నారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఇది ధూమపానం చేసేవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పొగాకు ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలను కలిగిస్తుంది. తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, నిద్రలేమి లక్షణాలు కనిపిస్తాయి.

ఊపిరితిత్తుల జబ్బులు

పొగాకు వాడే వ్యక్తులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. శారీరక శ్రమ తగ్గుతుంది, నిద్రలేమి ఏర్పడుతుంది.

గుండె సమస్యలు

పొగాకులో ఉండే రసాయనాలు రక్తనాళాల్లోకి చేరి వాటిని దెబ్బతీస్తాయి. ఇది గుండె ప్రమాదాలకు దారితీస్తుంది. గుండెపోటు, ఛాతీ నొప్పి, హైపర్ థెర్మియా వంటి సమస్యలు ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు సంభవిస్తాయి.

స్ట్రోక్

ధూమపానం రక్తపోటును పెంచుతుంది. రక్తంలోని రక్తనాళాలు గడ్డకట్టకుండా ఉండటాన్ని ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాం. మెదడుకు చేరితే ప్రాణాంతకం కావచ్చు. ఇది మెదడును దెబ్బతీస్తుంది పక్షవాతం కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. .

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News