ఈ లక్షణాలు కనిపిస్తే.. శరీరంలో జింక్ లోపం ఉన్నట్టే..!
జింక్ మన శరీరానికి చాలా ముఖ్యం.
దిశ, ఫీచర్స్ : జింక్ మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రమాదాల వలన అయిన గాయాలు నయం చేసి ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటులో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రజలు తమ బిజీ లైఫ్‌లో ఆహారపు అలవాట్లపై తగినంత శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో జింక్ లోపం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జింక్ లోపం శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి జింక్ చాలా ముఖ్యమైనది. ఈ లోపం వలన శరీరంలో వివిధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
2. తరచుగా జలుబు, దగ్గు, చెవి ఇన్ఫెక్షన్ల సమస్యలు వస్తూనే ఉంటాయి
3. జింక్ లోపం ఉన్న వారికి గాయాలు త్వరగా మానవు
4. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు జింక్ చాలా అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో లోపం జుట్టు రాలడం, పొడి చర్మం, మొటిమలు, చర్మం మీద మచ్చలు రావడం వంటి తీవ్రమైన లక్షణాలకు దారి తీస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.