Diabetes : చిన్న నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా మారొచ్చు.. డయాబెటిస్ ఉంటే బీ కేర్ ఫుల్ !
Diabetes : చిన్న నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా మారొచ్చు.. డయాబెటిస్ ఉంటే బీ కేర్ ఫుల్ !
దిశ, ఫీచర్స్ : డయాబెటిస్.. ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. నిజానికిది రక్తంలో చక్కరస్థాయిలను ప్రభావితం చేసే వ్యాధి. ఒకసారి శరీరంలో డెవలప్ అయిందంటే జీవితాంతం ఉంటుంది. నియంత్రణలో ఉంచుకోకపోతే హెల్త్ రిస్క్ పెరుగుతుంది. పలు అనారోగ్యాలకు దారితీస్తుందని, హార్ట్, లివర్, కిడ్నీలు, లంగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతింటే అది నరాలను ప్రభావితం చేసే ‘డయాబెటిక్ న్యూరోపతి’ అనే పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు.
మధుమేహం ఊపిరితిత్తులను, నరాలను ప్రభావితం చేసే డయాబెటిక్ న్యూరోపతికి దారి తీయకూడదంటే.. దానిని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం రోజువారీ వ్యాయామాలు, ఆహార నియమాలు, క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన మెడిసిన్ వాడటం, జీవనశైలిలో సానుకూల మార్పులు వంటివి చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అధిగ షుగర్ లెవెల్స్ అనేవి ఊపిరితిత్తులు, శరీరంలోని నరాల సామర్థ్యాన్ని, వాయి మార్గాల పనితీరును, కార్బన్ మోనాక్సైడ్ కోసం పల్మనరీ వ్యాప్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా లంగ్స్ పరిమాణంలో మార్పు వస్తుంది. శ్వాసకోశ కండరాలు సక్రమంగా పనిచేయవు కాబట్టి శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తరచుగా అలసటకు గురికావడం జరుగుతుంది. ఇటీవల ఇదొక సాధారణ ఆరోగ్య సమస్యగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో లంగ్స్‌లో చికాకు ఏర్పడటం లేదా వ్యాధికారకాలను దూరం చేయడం కష్టంగా మారుతుంది. క్రమంగా ఇది ఆస్తమా, టీబీ వంటి వ్యాధుల ముప్పును పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకునేందుకు అవసరమైన చర్యలు తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.