భర్తలూ.. భార్య కోపంగా ఉందా?.. అయితే ఇలా హ్యాండిల్ చేయండి..!
వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా అని చాలా మంది అనడం మనం వింటూనే ఉన్నాం..
దిశ, ఫీచర్స్: వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా అని చాలా మంది అనడం మనం వింటూనే ఉన్నాం.. అసలు ఇలా అనడానికి కారణం మాత్రం భార్యాభర్తల మధ్య జరిగే అంతులేని గొడవలే కారణం అని అందరికీ తెలిసిందే. సాధారణంగా పెళ్లైన కొత్తలో ఉన్న జీవితం లైఫ్‌లాంగ్ అలానే ఉండాలి అనుకోవడం పూర్తి భ్రమ. భార్యా భర్తల మధ్య కోపం, గొడవలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని శృతి మించకుండా చూసుకోవాలి. భర్త లేదా భార్య రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత భర్త లేదా భార్య కొంత రిలాక్స్ అవుదామని అనుకుంటారు. ఆ సమయంలో భార్య భర్తపై లేదా భర్త భార్యపై కోపంగా ప్రవర్తిస్తే ఇక ఆ వైవాహిక జీవితం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది.
భార్య తన భర్తను చాలా సులువుగా మ్యానేజ్ చేసుకోగలదు, అయితే ఈ విషయంలో భర్తలు మాత్రం కొంత వెనుకబడి ఉన్నారనే చెప్పుకోవాలి. భార్య ప్రేమతో వున్నట్టే వుండి ఒక్కసారిగా కోపంతో భర్త మీద పడిపోతుంది. ఈ సమయంలో భార్య కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమవుతుంటాడు. ఇలాంటి భార్యల పట్ల ఎలా మెలగాలి. భార్యల కోపాన్ని ఎలా అణచివేయాలో ఇక్కడ కొన్ని చిట్కాలను చూద్దాం..
ఆమెతో కొంత టైమ్ స్పెండ్ చేయాలి:
ఆఫీస్‌కి వర్క్‌తో అలసిపోయిన భర్త ఇంటికి వచ్చి భోజనం చేసి వెంటనే పడుకుంటాడు. ఇలా చేయడం వల్ల కూడా భార్యకు కోపం వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో కొంత టైమ్‌ని స్పెండ్ చేయాలి. ఎంత బిజీగా ఉన్నా భార్య కోసం కొంత సమయాన్ని కేటాయించి ఆమెతో మాట్లాడితే భార్యకు కోపం రాకుండా ఉంటుంది.
ఆమెను కౌగిలించుకోవాలి:
మీ భార్యకు వెంటనే ఎక్కడా లేని కోపాన్ని మీ పైన ప్రదర్శిస్తే ముందుగా మీరు చేయవలసిన పని. మీ భార్యను దగ్గరకు తీసుకుని ఒక కౌగిలింతను ఇచ్చి ఆమెను ముద్దు పెట్టుకోవాలి. ఇలా చేయగానే ఆమెకు ఉన్న కోపం ఉన్నట్టుండి ఎగిరి పోతుంది. భర్త ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతే భార్య ఇంటి పనులు, పిల్లలు, అత్తా,మామ, సరుకులు, వంట, క్లీనింగ్ పనులతో బిజీ అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో భార్యకు చిరాకు రావడం సహజం. కాబట్టి భర్త వీటన్నింటినీ అర్థం చేసుకొని భార్యకు ఒకరోజు పనులన్నింటినీ పక్కనపెట్టి రెస్ట్ తీసుకోమని చెప్పాలి.
మీరే పిల్లల్ని చూసుకోవాలి:
భార్య కోపంగా ఉంటే పిల్లలను దగ్గరకు తీసుకొని వారి బాగోగులు చూడాలి. పిల్లలను ఆడించడం, వారికి తినిపించడం, వారితో మాట్లాడటం చేస్తే భార్యకు కోపం తగ్గుతుంది. పిల్లలతో కలిసి కాలం గడపడం వల్ల భార్య కూడా భర్తపై అరిచే సమయం, సందర్భం దొరకదు.
ప్రేమను చూపాలి:
మీ పై భార్య ఎంత కోపాన్ని ప్రదర్శించినా మీరు ఓర్పుతో, సహనంతో ఉండాలి. ఆమె కోపాన్ని ప్రదర్శించినప్పుడల్లా మీరు ఆమెపై ప్రేమను కురిపించాలి. అలా కాకుండా మీరు కూడా కోపాన్ని ప్రదర్శిస్తే మంటపై పెట్రోల్ పోసినట్లవుతుంది. వీలైతే భార్యకు క్షమాపణ చెప్పండి. దాని వల్ల భార్య కోపం ఖచ్ఛితంగా తగ్గుతుంది.
భార్యకు గిఫ్ట్స్ ఇవ్వాలి:
మీ భార్య మీపై తరచూ కోపాన్ని చూపిస్తుందని మీకనిపిస్తే.. మీ బ్యాగులో ముందు జాగ్రత్తగా ఎప్పుడూ ఒక చిన్న గిఫ్ట్‌ని ప్యాక్ చేసుకొని పెట్టుకోండి. ఆ గిఫ్ట్స్ కూడా మీ భార్యకు ఇష్టమైన వస్తువులకు సంబంధించిన ఉండాలి. ఇలాంటివి భార్యకు గిఫ్ట్ చేయడం వల్ల ఆమె కోపం వెంటనే కరిగిపోతుంది.