ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్ ముగియగానే ఇకపై వాళ్లకు జీరో బిల్లుల జారీ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.
దిశ, సినిమా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గృహ జ్యోతి క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో2024 ఫిబ్రవరి 27న 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో మార్చి మొదటి వారం నుంచి బిల్లులు జీరోగా వస్తున్నాయి. అర్హులకు జీరో బిల్స్ జారీ చేయడానికి గాను బిల్లింగ్ మిషన్ లో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేశారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు, రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మిషన్ లో నుంచి ఆటోమేటిక్ గా జీరో బిల్ వచ్చేలా ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఇప్పటికే చాలా మందికి జీరో బిల్స్ వస్తుండగా.. రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచే గృహ జ్యోతి పథకం అమల్లోకి రాబోతోంది. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఏరియాలో సున్నా బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. జూన్ 6వ తేదీ నుంచి 200 యూనిట్ల లోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేస్తారట. గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్ పరిశీలించి 6వ తేదీ నుంచి సున్నా బిల్లులు ఇవ్వబోతున్నారు.
కాగా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు వాడితేనే.. వారికి ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఉచితంగా ఇస్తున్నారు కదా..అని ఇష్టానుసారం కరెంట్ వాడితే.. అది 200 యూనిట్లు దాటితే.. మీకు ఉచిత పథకం వర్తించదు. కరెంట్ బిల్లు కట్టాల్సి ఉంటుంది.