ఈవినింగ్ స్నాక్స్.. గరం గరం బ్రెడ్ మసాల చిప్స్.. ఇలా రెడీ చేయండి!
సాయంత్రం అయ్యిందంటే చాలు, వేడి వేడిగా స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వారు, చిన్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా స్నాక్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
దిశ, ఫీచర్స్ : సాయంత్రం అయ్యిందంటే చాలు, వేడి వేడిగా స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వారు, చిన్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా స్నాక్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే ఆఫీసుల్లో వర్క్ చేసేవారు. ఈవినింగ్ స్నాక్స్ తిని, టీ తాగి వర్క్ మీద కాంన్సట్రేషన్ చేస్తుంటారు.అందువలన ప్రతీ మహిళ తన కుటుంబ సభ్యుల కోసం ఏదో ఒక వెరైటీని ఇంట్లో చేస్తుంది.
అయితే అసలు కొత్తగా ఏ వంట చేయాలి. పిల్లలు ఇష్టంగా తినడానికి స్నాక్స్‌గా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మీకోసమే అదిరిపోయే గరం గరం స్పైసీ బ్రెడ్ మసాలా చిప్స్.ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
బ్రెడ్
నూనె
జీలకర్ర
పచ్చిమిర్చి
ఉల్లిపాయ
అల్లం వెల్లుల్లి పేస్ట్
టొమాటో
పసుపు పొడి
కారం
గరం మసాలా
ఉప్పు
టొమాటో కెచప్
తయారీ విధానం :
ముందుగా 5 బ్రెడ్స్ తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి అయ్యాక బ్రెడ్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వాటిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత అందులోచిన్నగా తరిగినిన పచ్చిమిర్చి, జిలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.తర్వాత టొమాటో, పసుపు, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. అవి వేగాక, నాలుగు టేబుల్ స్పూన్స్ టామాటో కెచప్, అలాగే బ్రెడ్ ముక్కలు వేసి కలపాలి. అంతే గరం గరం బ్రెడ్ మసాలా చిప్స్ రెడీ.