కొత్తిమీర 15 రోజుల పాటు ఫ్రిజ్ లేకుండా తాజాగా ఉండాలంటే ఈ అదిరిపోయే చిట్కాలు మీ కోసం!
మన భారతీయ వంటకాల్లో అతి ముఖ్యమైనది పచ్చి కొత్తిమీర.
దిశ, వెబ్‌డెస్క్: మన భారతీయ వంటకాల్లో అతి ముఖ్యమైనది పచ్చి కొత్తిమీర. ఇది కేవలం రుచి కోసమే కాకుండా జీర్జక్రియ మెరుగుపడడానికి ఎంతగానో మేలు చేస్తుంది. అయితే కొత్తిమీరను మార్కెట్ నుంచి తెచ్చిన 2,3 రోజులకే పాడైపోతుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే కొత్తిమీరను ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలను తెలుసుకుందాం..
* కొత్తిమీరను మార్కెట్ నుంచి ఇంటికి తీసుకువచ్చినాక ముందుగా ఒక గ్లాస్ లేదా డబ్బాలో నీటితో నింపి, అందులో కొత్తిమీర కాడలను ముంచండి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఎండిపోకుండా తాజాగా ఉంటుంది.
* కొత్తిమీరను నీడలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. అలాగే అందులోని మూలకాలు నశించవు. కాబట్టి మీరు ఆహారం తీసుకుంటే పోషకాలు అందుతాయి. కొత్తిమీరలోని మూలకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
* కొత్తిమీరను గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచడం వల్ల అది పాడవ్వదు. అలాగే తడి టిష్యూ పేపర్‌లో కూడా ఉంచవచ్చు.
* కొత్తిమీర ఆకులను తడిగా ఉండే టిష్యూలో చుట్టడం ద్వారా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.
* కొత్తిమీరను ఐస్ వాటర్‌తో కడగడం ద్వారా ఆకులు పచ్చగా ఉంటాయి.
Read More: 30 నిమిషాల్లో ఈ సమోసా తింటే రూ. 71,000 మీవే