తిన్న తర్వాత కడుపు ఉబ్బుతుందా.. ! నిపుణులు సూచించిన హోం రెమిడీస్..

పొట్టను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చంటున్నారు వైద్యనిపుణులు.

Update: 2024-03-11 06:50 GMT

దిశ, ఫీచర్స్ : పొట్టను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చంటున్నారు వైద్యనిపుణులు. చాలా రోగాలకు కడుపులో కలిగే సమస్యలే కారణం అన్నది కూడా నిజం. క్రమరహిత ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా పొట్ట సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం ఇవన్నీ సాధారణ పొట్ట సమస్యలు.

అయితే చాలామందికి పొట్టలో సమస్యల కారణంగా ఆహారం తినగానే పొట్ట ఉబ్బినట్లు, నిండినట్లు అనిపిస్తుంది. ఈ సమస్య పై సీనియర్ డైటీషియన్ మాట్లాడుతూ ఆహారం, ఒత్తిడి, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ గ్యాస్ ఉత్పత్తికి కారణమవుతాయని చెప్పారు. తరచుగా గ్యాస్, ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇంటి చిట్కాలతోనే నివారించవచ్చంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా.

జీలకర్ర.. 

జీలకర్రను మెత్తగా రుబ్బి, దానిలో నల్ల ఉప్పు కలపాలి. భోజనం చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కేవలం ఒక సిప్ నీటితో మింగాలి. దీనితో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలని చెబుతున్నారు.

దాల్చిన చెక్క, పసుపు, నిమ్మకాయ..

దాల్చిన చెక్క, పసుపు, నిమ్మకాయ నీరు ఉబ్బరం సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పానీయం బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. ఉబ్బరం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రోజూ పుదీనా టీ లేదా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం లేదా అపానవాయువు సమస్య ఉంటే నిపుణులు సూచించిన ఈ ఇంటి నివారణలను అనుసరించవచ్చు.

Tags:    

Similar News