Health Tips : పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా..? ఈ ఆహారాలు తప్పక ఇవ్వాల్సిందే!

Health Tips : పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా..? ఈ ఆహారాలు తప్పక ఇవ్వాల్సిందే!

Update: 2025-04-19 11:14 GMT
Health Tips : పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలా..? ఈ ఆహారాలు తప్పక ఇవ్వాల్సిందే!
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : మీ పిల్లలు తరచూ డల్‌గా ఉంటున్నారా? వారు యాక్టివ్‌గా లేరని భావిస్తున్నారా? అయితే పోషకాహార లోపం కూడా కావచ్చు. ఎదిగే వయసులో తగిన పోషకాలు అందకపోతే మెదడు చురుగ్గా పనిచేయకపోవచ్చు. దీంతో చిన్నారులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంకపోవచ్చు. జ్ఞాపక శక్తి కూడా తగ్గే చాన్స్ ఉంటుంది. అలా జరగకూడదంటే బ్రెయిన్ షార్ప్‌నెస్‌ను పెంచే ఆహారాలను అందించాలి. అవేంటో చూద్దాం.

*పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారంలో కోలిన్, ఫోలేట్, ఐరన్, అయోడిన్, పాలీ ఆన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాకుండా ఒమేగా - 3 ఫ్యాటీ సియాడ్స్, విటమిన్ ఎడి, బి6, బి12 జింక్ సహా తగిన ప్రొటీన్లు అవసరం. ఇవన్నీ తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి వాటిలో పుష్కలంగా లభిస్తాయి. పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే 5 నుంచి 8 ఏండ్ల వయసున్న పిల్లలకు రోజుకు రెండు ఉడకబెట్టిన గుడ్లను తినిపించడం మంచిదంటున్నారు నిపుణులు.

* స్వోర్డ్ ఫిష్, టిలాపియా, ట్యూనా వంటి అధిక పోషకాలు పోషకాలు కలిగిన చేపలను ఆహారంలో భాగంగా పిల్లలకు ఇవ్వాలి. వీటిలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ఫోలేట్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆకు కూరలను, పెరుగును కూడా ఆహారంలో భాగంగా చేర్చితే జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

* విటమిన్లు, మినరల్స్, ఐరన్, జింక్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే మరో ఆహారం డ్రై ఫ్రూట్స్. ముఖ్యంగా కాజు, బాదం, ఖర్జూరం వంటివి పిల్లల మెమోరీ పవర్ పెరగడానికి మంచి ఆహారం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News