Health : ఆ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న కార్బోనేటెడ్ డ్రింక్స్.. వీటిలో ఏముంటాయంటే..

Health : ఆ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న కార్బోనేటెడ్ డ్రింక్స్.. వీటిలో ఏముంటాయంటే..

Update: 2024-12-13 08:29 GMT

దిశ, ఫీచర్స్ : సీజన్ ఏదైనా చాలా మంది కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. వేడి వేడి ఆహారాలు తిన్నాకనో, నాన్ వెజ్ తిన్న తర్వాతనో చల్లని పానీయాలు తాగడానికి కొందరు ఇష్టపడుతుంటారు. అధిక చక్కెరలు, ఆరోగ్యానికి హానిచేసే పదార్థాలు కలిగి ఉండటంవల్ల వాస్తవానికి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చాలామంది ‘కూల్ డ్రింక్స్’గా భావిస్తారు కానీ.. అవి మరో రకంగా శృంగార సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘కిల్ డ్రింక్స్’ అంటున్నారు నిపుణులు. తరచుగా తాగితే ఏం జరుగుతుందో చూద్దాం.

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగుతాయ్

కార్బోనేటెడ్ పానీయాల్లో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల శక్తిహీనంగా మారుతారు. అలసటగా అనిపిస్తుంది. మూడ్ స్వింగ్స్ వేధిస్తాయి. లైంగిక జీవితానికి ప్రేరణగా ఉండే లిబిడో తగ్గిపోతుంది. అంతే కాకుండా బాడీలో ఇన్సులిన్ లెవల్స్‌పై ప్రభావం చూపడంవల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

డీహైడ్రేషన్‌కు గురయ్యే చాన్స్

అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్.. ఇలా పేరేదైనా వీటిని కార్బోనేటెడ్ డ్రింక్స్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. ఎక్కువగా తాగడంవల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా బాడీలో ప్రైవేట్ పార్ట్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందని, ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా తాగడకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

హార్మోన్లపై ఎఫెక్ట్

కడుపులో ఉబ్బరం, ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొందరు కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.ఈ కార్బోనేటెడ్ పానీయాలు ఆ సమస్యను తగ్గిస్తాయని భావిస్తారు. కానీ ఇది వాస్తవం కాదు. నిజానికి వీటిలో పీహెచ్ (pH) స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎసిడిటీని మరింత పెంచుతాయి. బాడీలో నేచురల్ పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ పరిస్థితి క్రమంగా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అధికంగా రిలీజ్ అవుతుంది. ఇది సెక్స్ డ్రైవ్‌కు ప్రేరణగా ఉండే టెస్టోస్టిరాన్ తగ్గుదలకు దారితీస్తుంది.

ఇలా చేస్తే బెటర్

కార్బోనేటెడ్ పానీయాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలంటున్నారు నిపుణులు. ఇక హైడ్రేటెడ్‌గా ఉండేందుకు డైలీ కనీసం 8 నుంచి 9 గ్లాసుల వాటర్ తాగాలి. ఇక అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండేదుకు పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, హెల్తీ ఫ్యాట్స్, ఆకు కూరలు, ప్రొటీన్లు కలిగిన ఆహారాలు డైట్‌లో భాగంగా చేర్చుకోవాలి. యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్స్, వ్యాయామాలు లేదా ఫిజికల్ యాక్టివిటీస్ కలిగి ఉండాలి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More..

Beauty Tips : ఏజ్ పెరిగినా గ్లామర్ తగ్గొద్దంటే.. 

Tags:    

Similar News