Health : ఆలస్యంగా నిద్రపోయి.. త్వరగా లేస్తున్నారా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Health : ఆలస్యంగా నిద్రపోయి.. త్వరగా లేస్తున్నారా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Update: 2024-11-07 06:33 GMT

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాహారం, వ్యాయామాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా చాలా ముఖ్యం. ఉదయంపూట ఉద్యోగాలు, వివిధ పనుల్లో నిమగ్నమయ్యేవారు రాత్రిళ్లు కనీసం 7 గంటలైనా నిద్రపోవాలి. అలాగే నైట్‌షిఫ్టులు చేసేవారు పగటివేళలో క్వాలిటీ స్లీప్‌ను (quality sleep) కవర్ చేయాలి. అలాంటప్పుడు నిద్రలేమి, ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదు. కానీ కొందరి జీవన శైలి ఇందుకు భిన్నంగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు.

రాత్రిళ్లు ఎలాంటి వర్క్ లేకున్నా కొందరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువసేపు ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి స్క్రీన్లను చూడటం, నిద్రకు ఉపక్రమించే సమయంలో సోషల్ మీడియాలో స్ర్కోల్ చేయడం (Circulating on social media) వంటివి ఆ సమయంలో నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో ఏ అర్ధరాత్రి దాటాకనో నిద్రపోతుంటారు. అయితే ఉదయం పూట మళ్లీ ఉద్యోగాలకు వెళ్లడం, వివిధ పనులు ఉండటం కారణంగా త్వరగా లేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం త్వరగా లేవడం అనేది ఆరోగ్యంపై ప్రమాదంలో పడుతోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఏయే సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం.

దీర్ఘకాలిక వ్యాధులు

రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేవడం ఎప్పటికీ కొనసాగుతూ ఉంటే మీరు నాణ్యమైన నిద్రను కోల్పోతారు. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ (Circadian rhythm) దెబ్బతింటుంది. ఫలితంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఒత్తిడి పెరుగుతుంది

తగినంతగా నిద్రలేనప్పుడు సహజంగానే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అధికమొత్తంలో కార్టిసాల్ హార్మోన్ (Cortisol hormone) రిలీజ్ అవుతుంది. ఇది మీలోని ఆనందాన్ని దూరం చేసి, అతి ఆలోచనలకు, మానసి రుగ్మతలకు ప్రేరణగా నిలుస్తుంది. ఆందోళన, టెన్షన్ (Anxiety, tension) వంటివి పెరిగిపోతాయి. నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్ వంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి.

జ్ఞాపకశక్తి తగ్గుతుంది

క్వాలిటీ స్లీప్ తగ్గడం దీర్ఘకాలంపాటు కొనసాగితే మెదడు పనితీరు నెమ్మదిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ముఖ్యంగా జ్ఞాపక శక్తి (The power of memory) తగ్గే అవకాశం ఎక్కువ. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడంలో ఇబ్బంది పడతారు. కాబట్టి రోజుకూ 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News