కందిపప్పును అతిగా తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే!
మన దేశంలో కందిపప్పుకు ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కందిపప్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం జరిగినా, కందిపప్పుతో పప్పు చారు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా
దిశ, ఫీచర్స్ : మన దేశంలో కందిపప్పుకు ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కందిపప్పు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం జరిగినా, కందిపప్పుతో పప్పు చారు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో చాలా మంది ఎక్కువగా సాంబార్ చేసుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఎందుకంటే కందిపప్పుతో చేసే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది.
అలాగే కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్, అజీర్తి లాంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. ఇక ఇది హెల్త్‌కు మంచిదని చాలా మంది కందిపప్పును అతిగా తింటుంటారు. అయితే కందిపప్పును ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పైల్స్ సమస్యతో బాధపడున్నవారు కందిపప్పును అతిగా తినడం వలన ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువలన దీన్ని ఎక్కువగా తినడం వలన హైపర్ కలేమియా ఏర్పడుతుదంట. దీని ద్వారా కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఒక్కోసారి వాంతులు కూడా కావచ్చు. అలాగే కందిపప్పు మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది అంటున్నారు వైద్యులు. ఇందులో ఉండే యూరిక్ యాసిడ్ స్పటికాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తాయంట. అందువలన పప్పును అతిగా కాకుండా తగిన మోతాదులో తీసుకోవాలంటున్నారు నిపుణులు.