Harvard University : సంతోషం కావాలా నాయనా..! అయితే ఈ కోర్స్ మీకోసమే
జీవితంలో మంచి సంపాదన, కుటుంబం, గౌరవం అన్నీ ఉన్నా కూడా చాలామందికి సంతోషం అనేది ఉండదు.
దిశ, వెబ్ డెస్క్ : జీవితంలో మంచి సంపాదన, కుటుంబం, గౌరవం అన్నీ ఉన్నా కూడా చాలామందికి సంతోషం అనేది ఉండదు. సంతోషం కోసం ఏవేవో దారులు వెతుక్కున్నా ఫలితం శూన్యం అనిపిస్తుంది. సంతోషంగా ఉండటం ఎలాగో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసమే అమెరికా(America)లోని మసాచుసెట్స్(Massachusetts) లోని హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ఓ కొత్త కోర్సును ప్రవేశ పెట్టింది. మేనేజింగ్ హ్యాపీనెస్(Managing Happiness) అనే ఈ కోర్సులో సంతోషం దాని నిర్వచనం, ఆనందం వెనుక ఉన్న సైన్స్, ఆనందం ప్రాముఖ్యత, సంతోషంపై జీన్స్, సామాజిక-ఆర్థిక అంశాల ప్రభావం వంటి అంశాలను బోధిస్తారు. ఆన్లైన్ వేదికగా బోధించబడే ఈ కోర్సు ఫీజు భారతీయ కరెన్సీలో రూ.18,199 గా ఉంది. ఇంకేం మరి ఈ కోర్సు చేసి బోలెడు సంతోషాన్ని సొంతం చేసుకోండి.