సంగీతంతో బ్రెయిన్ పర్ఫార్మెన్స్ డబుల్
దిశ, ఫీచర్స్ : వీనుల విందైన సంగీతం మనసుకు హాయిని, ప్రశాంతతను చేకూరుస్తుందని తెలిసిందే. ఇక మ్యూజిక్ థెరపీతో కొన్ని రకాల జబ్బులు నయం చేస్తుండగా..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : వీనుల విందైన సంగీతం మనసుకు హాయిని, ప్రశాంతతను చేకూరుస్తుందని తెలిసిందే. ఇక మ్యూజిక్ థెరపీతో కొన్ని రకాల జబ్బులు నయం చేస్తుండగా. ఏదేని పనిపై దృష్టి కేంద్రీకరించేందుకు కూడా గ్రూవీ మ్యూజిక్(ఆకర్షణీయ, ఉత్తేజకరమైన సంగీతం) సాయపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా మంచి రిథమ్ ఉన్న వ్యక్తుల్లో మల్టీ టాస్కింగ్‌కు ఉపయోగపడుతుందని సుకుమా యానివర్సిటీ సైంటిస్తులు గుర్తించారు.
ఈ అధ్యయనంలో మొత్తం 58 మంది పాల్గొనగా.. కలర్-వర్డ్ మ్యాచింగ్ టాస్క్ పూర్తి చేస్తున్నప్పుడు పరిశోధకులు వీరి బ్రెయిన్ ఇమేజింగ్‌ను ప్రదర్శించారు. ఇదే పనిని ఒకసారి మ్యూజిక్ వింటున్నపుడు, మరోసారి మ్యూజిక్ లేకుండా రెండు సార్లు చేయించారు. గ్యారేజ్‌బ్యాండ్‌లో డ్రమ్ బీట్స్‌తో నిమిషానికి 120 బీట్స్ రిథమ్‌తో సంబంధిత మ్యూజిక్ ట్రాక్ ప్లే చేశారు. ఇందులో పాల్గొన్నవారు బీట్‌తో సింక్రనైజ్ అయ్యేందుకు కష్టపడుతున్నారా లేదా వారి శరీరం రిథమ్‌తో ప్రతిధ్వనిస్తున్నట్లుగా భావిస్తున్నారా? తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పరిశోధకులు లెఫ్ట్ డోర్సోలేటరల్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్(ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్‌కు బాధ్యత వహించే మెదడులోని ఒక ప్రాంతం)ను చిత్రించడానికి IR స్పెక్ట్రోస్కోపీ దగ్గర ఫంక్షనల్‌ను ఉపయోగించారు. కాగా గ్రూవ్ రిథమ్ అనేది పార్టిసిపెంట్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్‌ను, అలాగే I-DLPFC యాక్టివిటీని పెంచిందని పరిశోధకులు కనుగొన్నారు. మ్యూజిక్ విన్న తర్వాత 'గ్రేటర్ గ్రూవ్ సెన్సేషన్' లేదా పనిపట్ల మరింత అప్రమత్తతగా ఉన్నట్లు తేలింది. అంటే సంగీతానికి మెరుగైన మానసిక ప్రతిస్పందన కలిగివున్నవారి మెదడు శక్తిని మాత్రమే ట్యూన్స్ మెరుగుపరుస్తాయని దీని అర్థం.