GREAT: అమ్మ నాన్నలకు గుడి కట్టి నిత్యం పూజలు..!
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వృధ్దా శ్రమానికి పంపించేస్తున్నారు. కొందరైతే ఏకంగా మీ చావేదే మీరే చావండి అంటూ నడి రోడ్డు మీద పడేస్తున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వృధ్దా శ్రమానికి పంపించేస్తున్నారు. కొందరైతే ఏకంగా మీ చావేదే మీరే చావండి అంటూ నడి రోడ్డు మీద పడేస్తున్నారు. తన పిల్లల లాగే వారు కూడా మనల్ని పెంచి ఉంటారని ఆలోచించకుండా తల్లి తండ్రులపై కర్కషంగా ప్రవర్తిస్తున్నటువంటి బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో ముగ్గురు కుమారులు తన తల్లిదండ్రులకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నారు.
ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్న పేటలో జరిగింది. గొట్టె కనకయ్య, కొమురవ్వ అనే దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. 4 ఏళ్ల క్రితం తల్లి.. గతేడాది తండ్రి కూడా మరణించారు. అయితే వారు తల్లిదండ్రులు లేరనే భావన కలగకుండా నిత్యం తమ కళ్ల ముందే ఉండేలా పొలంలో గుడిని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించారు. కాగా నిన్న తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతోంది.