చికెన్ ప్రియులకు శుభవార్త..!
సంక్రాంతి పండుగపూట మాంసం ప్రియులకు ఉపశమనం కలిగేలా మరోసారి చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి
దిశ, ఫీచర్స్: సంక్రాంతి పండుగపూట మాంసం ప్రియులకు ఉపశమనం కలిగేలా మరోసారి చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కార్తీకమాసంలో భారీగా పెరిగిన ధరలు.. ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమైన ధరల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ రూ.180 కి విక్రయిస్తున్నారు . మరోవైపు కార్తీకమాసంలో చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ చికెన్.. రూ. 250 వరకు పలకగా.. గుడ్డు ఒక్కోటి రూ. 7-8 పలికింది. దీంతో మాంసం కొనలేక, తినలేక మాంసం ప్రియులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధరలు తగ్గడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు.
ధరలు కిలోల్లో:
చికెన్ = రూ.180
బోన్‌లెస్ = రూ. రూ.220
కంట్రీ చికెన్ = రూ.360
చికెన్ లివర్ = రూ.125
లైవ్ చికెన్ = రూ. 130
స్కిన్ లెస్ చికెన్ = రూ.200