గాడ్జెట్స్ అంత్యక్రియలు.. ఏటా కోట్లలో సంపాదిస్తున్న కళాకారులు

మొదటి కారు.. ఫస్ట్ సెల్‌ఫోన్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్.. ఇలా కొన్ని వస్తువులతో మనుషులకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది.

Update: 2022-10-15 08:52 GMT

దిశ, ఫీచర్స్: మొదటి కారు.. ఫస్ట్ సెల్‌ఫోన్.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్.. ఇలా కొన్ని వస్తువులతో మనుషులకు ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. సరికొత్త ఫీచర్స్‌తో అప్‌గ్రేడ్ వెర్షన్స్ వస్తున్నా సరే వాటిని విడిచిపెట్టేందుకు మనసొప్పదు. సరిగ్గా పనిచేయకపోయినా తమ నుంచి దూరమవుతుందనే భయంతో పక్కనపెట్టేందుకు ఆలోచిస్తుంటాం. అలాంటి వ్యక్తుల ఆలోచనను పసిగట్టిన చైనా అమ్మాయి 'గాడ్జెట్ ఫ్యునెరల్(గాడ్జెట్ అంత్యక్రియలు)' సర్వీస్‌తో లక్షలు సంపాదిస్తోంది. వాడుకలోని లేని పరికరాలను ఫ్రేమ్డ్, పునర్నిర్మిత కళాకృతులుగా మారుస్తూ.. ఎప్పటికీ తమతోపాటే ఉండిపోయే విధంగా మారుస్తోంది.

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వీఫాంగ్‌కు చెందిన లిన్ జి అనే యువతి 2019లో లాభదాయకమైన 'గాడ్జెట్ ఫ్యునెరల్' వ్యాపారాన్ని ప్రారంభించింది. UKలో చదువుకున్న ఆమెకు ఎలక్ట్రానిక్ మౌంటింగ్ ఆర్ట్‌‌ గురించి విన్నాక, రీపర్పసింగ్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ ఆర్ట్ ఆసక్తికరంగా అనిపించింది. ఈ క్రమంలోనే తన దగ్గరున్న పాత ఎలక్ట్రానిక్స్‌ను కళాఖండాలుగా తీర్చిదిద్దాలనుకుని సక్సెస్ అయింది. దీంతో ఈ ఆర్ట్ అండ్ టెక్నాలజీలో మరింత నైపుణ్యం సాధించిన లిన్ జి.. తన సేవల గురించి ఆన్‌లైన్‌లో ప్రచారం మొదలుపెట్టింది. 'మీరు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను దూరం చేసుకోకండి. మీ కోసం దానిని డిజైన్ చేయనివ్వండి!' అంటూ ఇందుకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్‌ పోస్ట్ చేసింది. దీనికి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ రావడంతో పాటు కొద్ది రోజుల్లోనే 200కు పైగా ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్‌ను పూర్తి చేసేందుకు ఆరు నెలలు పట్టిందన్న లిన్.. ఏడాదికి రూ. కోటికి పైగా సంపాదిస్తున్నట్లు చెప్పింది. కాగా 'గాడ్జెట్ ఫ్యునెరల్' అనేది మౌంట్ ఆర్ట్. ఇందులో భాగంగా పాత లేదా విరిగిన పరికరాలను జాగ్రత్తగా వేరు చేసి, వాటి భాగాలను ఫ్రేమ్డ్ కాన్వాస్‌లలో 'సైబర్ సౌందర్యం(cyber aesthetics)' రూపంలో తిరిగి అమరుస్తారు.


మొదట, ప్రజలు 1970కి చెందిన మొదటి తరం మోటరోలా మొబైల్ ఫోన్, 200,000 యువాన్ల విలువైన అరుదైన వెర్టు ఫోన్, నోకియా 3650, మొట్టమొదటి భారీ-ఉత్పత్తి Android స్మార్ట్‌ఫోన్ HTC G1 వంటి ఎలక్ట్రానిక్ అవశేషాలతో లిన్ జి దగ్గరికి వచ్చారు. ఆమె వారందరిని సంతృప్తిపరిచేలా మొబైల్‌ఫోన్స్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయే స్మారక చిహ్నంగా, కళాకృతులుగా తీర్చిదిద్దడంతో.. మరిన్ని ఆర్డర్స్ రావడం ప్రారంభించాయి.



Tags:    

Similar News