ఇంటర్న్‌షిప్ క్వీన్.. ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా లక్షలు సంపాదిస్తున్న సౌరవ్ గంగూలీ కూతురు
భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రజెంట్ ఆయన కూతురు సనా గంగూలీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
దిశ, ఫీచర్స్ : భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రజెంట్ ఆయన కూతురు సనా గంగూలీ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. క్రికెట్ వరల్డ్‌లో తండ్రి ఏ విధంగానైతే ప్రతిభ చాటాడో, ఫైనాన్స్ ప్రపచంలో సనా కూడా అదే చేస్తోంది. ఆమె తన తండ్రి ఛేదించిన బౌండరీలను, సిక్సర్లను మరిపిస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌లో తనేంటో నిరూపించుకున్న సనా ఇప్పుడు డ్యాన్స్ యువరాణి మాత్రమే కాదు. లక్షల్లో వేతనం అందుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఇంటర్న్‌షిప్ క్వీన్ కూడా. ప్రస్తుతం ఒక ఫేమస్ సంస్థలో చేరిన ఆమె పెద్దమొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. అటువంటి గ్లోబల్ క్వీన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలేంటో చూద్దాం.
ఎడ్యుకేషన్ స్థాయిలోనే..
కొల్ కతాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన సనా గంగూలీ లండన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాగా ఆమె యూసీఎల్‌లో (UCL)లో ఎకనామిక్స్ చదువుతున్నప్పుడే ప్రపంచాన్ని ఆకర్షించింది. చదువుతోపాటు ఎనక్టస్ యూసీఎల్‌లో పూర్తి సమయం పనిచేస్తూ ఆమె హెచ్ఎస్‌బీసీ అండ్ గోల్డ్ మన్ సాచ్స్ వంటి దిగ్గజ కంపెనీలకు వర్క్ చేసింది. ప్రజెంట్ ఆమె ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ అడ్వైజ్ కంపెనీలలో ఒకటైన ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(PWC)లో కార్పొరేటర్ గేమర్‌గా కీ రోల్ పోషిస్తోంది. ఇంటర్న్‌షిప్ సూపర్ స్టార్‌గా ప్రతిభ చాటుతోంది.
లక్షల్లో వేతనం..
కార్పొరేట్ దిగ్గజాలనే ఆశ్చర్య పరుస్తున్న సనా గంగూలీ ఇంటర్న్‌షిప్ స్తాయిలోనే ఆమె జీతం లక్షల్లో ఉందట. ఒక నివేదిక ప్రకారం PWC ఇంటర్న్‌షిప్ సంవత్సరానికి రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఈ విదంగా చూస్తే సనా జీతం తక్కువేం కాదు. లక్షల్లో జీతం సంపాదిస్తున్న ఆమె ఫ్యాన్సీ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని మాత్రమే అనుకోకండి. ఆమెలో టాలెంట్ అలాంటి. ఫైరౌట్స్ నుంచి బోర్డ్ రూమ్‌ల వరకు ఉన్న మూస పద్ధతులను అమ్మాయిలు కూడా ఛేదించగలరని, కార్పొరేట్ ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నిరూపించిన ధైర్యశాలి. అంతేకాదు సనా భవిష్యత్ ఫైనాన్స్ అడ్వైజర్స్‌కు ఒక ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరాలని కోరుతూ పలువురు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.