అంతరిక్షంలో ఆకలి సమస్యకు చెక్.. వ్యోమగాములకు స్పెషల్ మీల్ రెడీ !

విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యోమగాములు ఒక సంవత్సరానికంటే ఎక్కువగానే అంతరిక్షంలోని వాతావరణంలో గడపాల్సి వస్తుంది.

Update: 2024-01-10 07:16 GMT

దిశ, ఫీచర్స్ : విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యోమగాములు ఒక సంవత్సరానికంటే ఎక్కువగానే అంతరిక్షంలోని వాతావరణంలో గడపాల్సి వస్తుంది. అయితే అక్కడ ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవడం అనేది ఇప్పటి వరకు కాస్త రిస్కుగానే ఉంది. ప్రిజర్వేటడ్‌ ప్యాక్‌ చేసిన ఆహారాలను వెంట తీసుకెళ్లినప్పటికీ అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం, భిన్నమైన స్పేస్ వెదర్ కారణంగా అది టేస్ట్ లేకుండాపోవడం, పోషకాలు నశించడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వ్యోమగాములు హెల్తీ ఫుడ్ అందక పలు హెల్త్ ఇష్యూస్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక నుంచి అటువంటి ఇబ్బందిలేకపోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎందుకంటే.. జీరో మైక్రో‌గ్రావిటీ వెదర్‌లోనూ రుచి, పోషకాలు ఏమాత్రం నశించని ప్రత్యేక సలాడ్‌ను ఏసీఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్స్ కొత్తగా తయారు చేశారు. దీనికి ‘ఆప్లిమల్ స్పేస్ మీల్’ అని పేరు పెట్టారు. ఇది అంతరక్ష పరిశోధనల్లో నిమగ్నమై ఉండే స్పేస్ సైంటిస్టులకు సరైన పోషకాలను అందిస్తుందట. పైగా అక్కడి వాతావరణంలో పాడవకుండా ఉంటుందని చెప్తున్నారు. వాస్తవానికి స్పేస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాములు.. భూమిపై ఉన్నప్పటికంటే కంటే ఎక్కువ కేలరీలను బర్న్‌ చేస్తారు. అక్కడి భిన్నమైన వెదర్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి వారికి కాల్షియంతోపాటు అధిక పోషకాలు కలిగిన ఆహారం అవసరం. ప్రజెంట్ ఏసీఎస్ ఫుడ్ సైన్స్ నిపుణులు కనుగొన్న సలాడ్ రూపంలో ఉండే ప్రత్యేక ఆహారం అందుకు ఉపయోపడుతుంది. ఇందులో సోయాబీన్స్, గసగసాలు, బార్లీ, కాలే, వేరుశెనగ, చిలగడదుంప, సన్ ఫ్లవర్స్ సీడ్స్ ద్వారా లభించే అన్ని రకాల పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


Similar News